చేతులేత్తి మొక్కుతా.. వాటిని వదిలేయండి: ఎంపీ మాధవ్‌

22 May, 2020 16:25 IST|Sakshi
ద్విచక్రవాహనాలను వదిలేయాలని పోలీసు అధికారులను కోరుతున్న ఎంపీ గోరంట్ల మాధవ్‌

సాక్షి, హిందూపురం: ‘మీకు చేతులేత్తి మొక్కుతా.. ద్విచక్రవాహనాలను స్టేషన్‌లో ఎండ పెట్టకుండా వదిలేయండి’ అంటూ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ సీఐలు బాలమదిలేటి, మన్సూరుద్దీన్‌లతో అన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించారంటూ పోలీసులు భారీ ఎత్తున వాహనాలను సీజ్‌ చేసి పోలీసుస్టేషన్‌లలో ఉంచారు. అవి ఎండకు ఎండి వానకు తడిసి చెడిపోయే స్థితికి చేరుకున్నాయి. దీనిపై సాక్షిలో కథనం కూడా ప్రచురితమైంది. చదవండి: దశలవారీ మద్యనిషేధంపై కసరత్తు షురూ..

ఈ క్రమంలో గురువారం స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో జరిగిన బియ్యం పంపిణీ కార్యక్రమానికి హాజరైన పోలీసు అధికారులతో ఎంపీ మాట్లాడారు. ఆయా వాహనదారులకు కోర్టు ద్వారా స్టేషన్‌ జరిమానాలు విధించి వదిలేయాలని కోరారు. ఎక్కువ రోజులు ఎండ పడితే పెట్రోల్‌ ఉన్న వాహనాల నుంచి మంటలు ఎగిసి.. బెంగళూరు నగరంలో జరిగినట్లుగా ప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాహనాదారులకు ఇబ్బంది కలగకుండా ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ కూడా పోలీసులకు సూచించారు.

చదవండి: 'ఆయన హయాంలో తట్ట మట్టి కూడా తీయలేదు' 

>
మరిన్ని వార్తలు