మూడు రాజధానులకు మద్దతుగా జిల్లాలో భారీ ర్యాలీ!

20 Jan, 2020 19:42 IST|Sakshi

సాక్షి, తూర్పు గోదావరి: రాజధాని వికేంద్రీకరణకు అసెంబ్లీలో ఆమోదం లభించడంతో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు  భారీ బైక్‌ ర్యాలీని నిర్వహించారు. రాజమండ్రిలోని మోరంపూడి జంక్షన్‌ నుంచి క్వారీ సెంటర్‌ వరకు జరిగిన ఈ ర్యాలీలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా పిఠాపురంలో సైతం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు సోమవారం పాదయాత్రను నిర్వహించారు.మరోవైపు రంపచోడవరంలో వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆంధ్రప్రదేశ్‌ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రామన్న దొర, మంగా బొజ్జయ్య, పండా రామకృష్ణ తదితరుల పాల్గొన్నారు.

కాకినాడ: రాష్ట్ర అభివృద్ధికై సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లుకు మద్దతుగా వైఎస్సార్‌ సీపీ కార్యాలయ నుంచి బలాజీ చెరువు సెంటర్‌ వరకు భారీ బైక్‌ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో నగర వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు ఫ్రూటీ కుమార్‌, యాళ్ల పట్టాభి, రావూరి వెంకటేశ్వరరావు, నల్లబిల్లి సుజాత, బెండా విష్ణు, పెదబాబు పాల్గొన్నారు.


రామచంద్రపురం: మూడు రాజధానుల బిల్లుపై అసెంబ్లీలో అమోదం ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తూ వైఎస్సార్‌ సీపీ నాయకులు ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్లమెంటరీ అధ్యక్షుడు తోట త్రిముర్తులు ఇతర నాయకులు పాల్గొన్నారు.

అమలాపురం: రాజధాని వికేంద్రీకరణ నిర్ణయానికి అసెంబ్లీ ఆమోదం అభించడంతో  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అదేవిధంగా కుడుపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో అమలాపురంలో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుడుపూడి సూర్యనారాయణ రావు, చెల్లుబోయిన శ్రీను, వంటెద్దు వెంకయ్య నాయుడు ఇతరులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘సీఎం జగన్‌ నిర్ణయం వల్లే మా ప్రాంతాల్లో వెలుగులు’

అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి: సుచరిత

మూడు రాజధానులపై టీడీపీ కార్యకర్తల అత్యుత్సాహం

చంద్రబాబుకు సవాల్‌ విసిరిన కొడాలి నాని

‘షో బ్యాగ్‌.. సీ బ్యాగ్‌’ చంద్రబాబు పాలసీ

సినిమా

పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌?

రౌడీ ఫ్యాన్స్‌కు లవ్‌ సాంగ్‌ గిఫ్ట్‌

నువ్వు గే అవ్వాలని ఎప్పుడు అనుకున్నావు?

బాలయ్య న్యూలుక్‌ అదిరింది!!

మాజీ భర్త కుటుంబాన్ని క్లిక్‌మనిపించిన నటి!

అల్లు అర్జున్‌.. ‘టైటిల్‌’ అది కాదా?