‘టీడీపీ ఓడిపోవడంతో బీజేపీలో చేరారు’

4 Jul, 2020 17:59 IST|Sakshi

సాక్షి, అమరావతి: బీజేపీలో చేరిన టీడీపీ నేతలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై కేంద్రానికి తప్పుడు సమాచారం చేరవేస్తున్నారని వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. తప్పుడు సమాచారంపై జాగ్రత్త వహించాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అదేవిధంగా గతంలో బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన వ్యక్తులు టీడీపీ ఓడిపోవడంతో బీజేపీ పంచన చేరారని తెలిపారు. (చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం)

మీరు ఏ సమాచారం అడిగినా ఇచ్చేందుకు తాము అందుబాటులో ఉంటామని చెప్పారు. గత ప్రభుత్వం విద్యుత్‌ రంగాన్ని పూర్తి సంక్షోభవంలోకి నెట్టేసిందన్నారు. సంక్షోభంలో ఉన్న విద్యుత్‌ రంగాన్ని ఆదుకునేందుకు రూ.17,904 కోట్లను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందజేసిందని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక పరిశ్రమలకు విద్యుత్‌ టారిఫ్‌ పెంచలేదని పేర్కొన్నారు. విద్యుత్‌ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు గ్రీన్‌ కో లాంటి సంస్థలు ముందుకు వస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు