తక్షణమే డెంగీ నివారణ చర్యలు చేపట్టండి

29 Sep, 2019 19:04 IST|Sakshi

ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు

సాక్షి, పాలకొల్లు: డెంగీ జ్వరాలు వ్యాపించకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు అధికారులను ఆదేశించారు. పాలకొల్లు మున్సిపల్‌ కార్యాలయంలో  పారిశుధ్యం, డెంగీ జ్వరాలపై అధికారులతో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణంలో 11వ  వార్డులో డెంగీ మరణాలు అధికంగా ఉన్నాయని.. నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రానున్న రోజుల్లో పాలకొల్లు, నరసాపురం, భీమవరం పట్టణాల్లో డంపింగ్‌ యార్డ్‌ సమస్య శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా మూడు, నాలుగు నెలల్లో పరిష్కరిస్తామని తెలిపారు. డ్రైన్లు గుర్రపు డెక్కతో నిండిపోయి మురుగు నీరు పారడంలేదని ఫిర్యాదులు వస్తున్నాయని.. వెంటనే తొలగింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో నియోజకవర్గ ఇంఛార్జ్‌ కవురు శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, యడ్ల తాతాజీ, చందక సత్తిబాబు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు