అఖిల భారత డ్వాక్రా బజార్‌ 2019

13 Oct, 2019 14:17 IST|Sakshi

సాక్షి, విజయవాడ : స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కాకినాడ ఎంపీ వంగా గీత తెలిపారు. విజయవాడ పీడబ్లూ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసి అఖిల భారత డ్వాక్రా బజార్‌ 2019ను ఎంపీ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దేశంలోనే రెండో అతిపెద్ద డ్వాక్రా బజారుగా ఈ బజార్‌ నిలిచిపోతుందని అన్నారు. ఢిల్లీలోని స్వరాజ్‌ మైదానంలో ఏర్పాటు చేసే ఎగ్జిబీషన్‌ బజారు తరువాత ఇదే అతి పెద్దదని పేర్కొన్నారు. 370 స్టాళ్లలో 22 రాష్టాలకు చెందిన  450 స్వయం సహాయక సంఘాలు భాగస్వామ్యం కావడం సంతోషమని తెలిపారు. కేవలం పది రోజుల్లోనే రూ. 3.5 కోట్ల వ్యాపారం జరగడం శుభ పరిణామన్నారు. డ్వాక్రా మహిళలకు చేయూతనిచ్చేలా ప్రతి జిల్లా స్థాయిలోనూ డ్వాక్రా బజార్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు.

అదే గ్రౌండ్‌లో మరోవైపు అపోలో టెలీ మెడిసిన్‌ నెట్‌ వర్కింగ్‌ ఫౌండేషషన్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆరోగ్యంపై ప్రజలందరూ  శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ ఫౌండేషన్‌ ఆ‍ధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించడం ఆనందకరమని, పీడబ్ల్యూ గ్రౌండ్‌లో అఖిల భారత డ్వాక్రా బజార్‌కు వచ్చేవారు సైతం ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. 

మరిన్ని వార్తలు