జీవీఎంసీ ఎన్నికలే టార్గెట్‌: విజయసాయి రెడ్డి

3 Aug, 2019 08:55 IST|Sakshi
విశాఖ ఎయిర్‌పోర్టులో విజయసాయిరెడ్డికి స్వాగతం లుకుతున్న మంత్రి అవంతి, ఎంపీలు, ఎమ్మెల్యేలు

వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు పిలుపు

నగరంలో ఎంపీ విజయసాయిరెడ్డి

సాక్షి, విశాఖపట్నం: రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడాలని  వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు, వి. విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. అందుకోసం సన్నద్ధం కావాలని సూచించారు. శుక్రవారం విశాఖ వచ్చిన విజయసాయిరెడ్డికి ఎయిర్‌పోర్టులో జిల్లా మంత్రి, ఎంపీలు, పార్టీ నగర అధ్యక్షుడు, ముఖ్యనాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా సీతమ్మధారలోని ఆయన కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో పాటు ప్రభుత్వ అధికారులు విజయసాయిరెడ్డిని కలిశారు. వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా రావడంతో ఆయన కార్యాలయం జనసంద్రంగా మారింది. 

విజయసాయిరెడ్డిని జిల్లా ఇన్‌చార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ  కలిశారు. అనంతరం జిల్లాలోని పలు సమస్యలను ఆయనకు వివరించారు. విజయసాయిరెడ్డిని కలిసిన వారిలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, భీశెట్టి సత్యవతి, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్, అదీప్‌రాజ్, గొల్ల బాబూరావు, కన్నబాబు రాజు, తిప్పల నాగిరెడ్డి,  వీఎంఆర్‌డీఏ చైర్మన్‌  ద్రోణంరాజు శ్రీనివాస్, పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణశ్రీనివాస్, ,మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దాడి వీరభద్రరావు, కోలా గురువులు, సమన్వయకర్తలు కె.కె. రాజు, అక్కరమాని విజయనిర్మల, అనకాపల్లి పార్లమెంట్‌ సమన్వయకర్త వరుదు కల్యాణి, డీసీసీబీ చైర్మన్‌ సుకుమారవర్మ 

రాష్ట్ర కార్యదర్శులు సత్తిరామకృష్ణారెడ్డి, రొంగలి జగన్నాథం, రాష్ట్ర అధికార ప్రతినిధులు జాన్‌వెస్లీ, కొయ్య ప్రసాదరెడ్డి, బెహరా భాస్కరరావు, దాడి రత్నాకర్, ముఖ్య నాయకులు ఫారుఖీ, అదనపు కార్యదర్శులు పక్కి దివాకర్, రవిరెడ్డి, మొల్లి అప్పారావు, నగర అనుబంధసంఘాల నాయకులు పీలా వెంకటలక్ష్మి, రామన్నపాత్రుడు, కాళిదాసురెడ్డి, ముఖ్యనాయకులు శ్రీ దేవివర్మ, ఆడిటర్‌ జి.వెంకటేశ్వర్లు, కాయల వెంకటరెడ్డి,రాధా, శశికళ, బి.కాంతారావు,సనపలచంద్రమౌళి, బాకి శ్యామ్‌కుమార్‌రెడ్డి, బర్కత్‌ ఆలీ, సుధాకర్, కిరణ్‌రాజు,అక్కరమాని వెంకటరావు,  జి. శ్రీధర్‌రెడ్డి, నాయుడు బాబు, రెయ్యి వెంకటరమణ, ఎ.రాజుబాబు పాల్గొన్నారు.

నేటి కార్యక్రమాలు ఇలా..
► ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి, ఎంపీ వి. విజయసాయిరెడ్డి శనివారం నగరంలో పలు అభివృద్ధి, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 
► ఉదయం 9.30 గంటలకు తొట్లకొండ దగ్గర జరిగే ‘వనం–మనం’ కార్యక్రమంలో భాగంగా మొక్కల నాటే కార్యక్రమంలో పాల్గొంటారు.
► 10 గంటలకు  బీచ్‌రోడ్డులోని ది పార్క్‌ హోటల్‌ ఎదురుగా ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అక్కడే తన ఎంపీ నిధులతో కేజీహెచ్‌కు సమకూర్చిన అంబులెన్స్‌తో పాటు రెండు ఆర్‌వో ప్లాంట్లను ప్రారంభిస్తారు. 
► 10.30 గంటలకు జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జరిగే  జిల్లా సమీక్షా మండలి సమావేశంలో పాల్గొంటారు.
► సాయంత్రం 6 గంటలకు జిల్లా పరిషత్‌ రోడ్డులో ఉన్న అంకోసా హాల్‌లో జరిగే వైఎస్సార్‌సీపీ మైనారిటీ విభాగం సమావేశంలో పాల్గొంటారు. అక్కడ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో విజయసాయిరెడ్డిని ఘనంగా సత్కరించనున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అందుకే కొత్త మద్యం పాలసీ : నారాయణస్వామి

ఈనాటి ముఖ్యాంశాలు

నరసరావుపేట పరువు తీసేశారు...

త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీ : గౌతమ్‌రెడ్డి

తప్పుడు వార్తలపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌

‘టీడీపీ హయాంలో బీసీలకు తీవ్ర అన్యాయం’

చంద్రబాబు పర్యటనపై స్థానికుల అసంతృప్తి

కోడెల ఒప్పుకుంటే.. తప్పు ఒప్పవుతుందా?

‘ప్రపంచంలో ఇలాంటి స్పీకర్‌ మరొకరు ఉండరు’

దళారులను నమ్మి మోసపోవద్దు: చీఫ్ విప్

చేసిన తప్పు ఒప్పుకున్న కోడెల..!

‘పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి’

ఆదర్శంగా నిలుస్తోన్న వృద్ధ దంపతులు

‘‘డ్రోన్‌’ గురించి బాబుకు చెప్పాల్సిన అవసరం లేదు’

అయిన వాళ్లే మోసం చేశారు!

‘వరద బాధితులందరికీ నిత్యవసర వస్తువుల పంపిణీ’

దేవదాసీలకు చేయూత నిద్దాం..

‘ప్రజలు బలైపోయినా బాబుకు ఫరవాలేదట..’

నష్టం అంచనాలు లెక్కించండి : సీఎం జగన్‌

టగ్‌ ప్రమాదం: మరో ఇద్దరి మృతి

చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్‌–2

నాడెప్‌ కుండీలతో నిధుల గల్లంతు..!

పర్యావరణాన్ని పరిరక్షిస్తూ.. పారిశ్రామిక కారిడార్‌

సమస్యకు పరిష్కారం లభించినట్టే

పోలీసుల అదుపులో టీడీపీ ‘కీ’ లేడీ

దుకాణంలో  దొంగలు.!

నకిలీ మకిలీ..!

సీఎం జగన్‌ పై నమ్మకంతోనే పార్టీలో చేరాం

సాగు.. ఇక బాగు!

పెళ్లయిన మూడు నెలలకే.. 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన శివజ్యోతి

ప్రముఖ దర్శకుడు మృతి

సైరా.. చరిత్రలో కనుమరుగైన వీరుడి కథ

బాబా భాస్కర్‌-అలీ వ్యవహారం ముదురుతోందా?

‘సాహో నుంచి తీసేశారనుకున్నా’

‘సాహో’ఖాతాలో ప్రపంచ రికార్డు