సీఎం జగన్‌తో ఎంపెడా చైర్మన్‌ భేటీ

4 Apr, 2020 19:37 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ఎంపెడా చైర్మన్‌ కేఎస్‌ శ్రీనివాస్‌ భేటీ అయ్యారు. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. కరోనా వైరస్‌ దృష్ట్యా ఆక్వా ఉత్పత్తులు, రైతుల ఇబ్బందులపై చర్చించారు. ఆక్వా రైతులు నష్టపోకుండా చూడాలని ఎంపెడా చైర్మన్‌కు సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా నిరోధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్వా జోన్లలో పర్యటించి రైతుల ఇబ్బందులను తెలుసుకోవాలన్నారు. దేశంలోని ఆక్వా ఉత్పత్తుల్లో అధికభాగం రాష్ట్రంనుంచి ఎగుమతి అవుతున్న నేపథ్యంలో ఇక్కడి రైతులకు కేంద్ర నుంచి ఆర్థిక సహాయం అందేలా తగిన చర్యలను తీసుకోవాలని సీఎం ఆదేశించారు. గడచిన ఐదురోజుల్లో 2832 మెట్రిక్‌ టన్నుల ఆక్వా ఉత్పతులను కొనుగోలు జరిగిందని, 2070 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తులను ఎగుమతి జరిగిందని అధికారులు సీఎంకు వివరించారు.

మరిన్ని వార్తలు