పీఠం దిగనున్న పరిషత్‌ పాలకులు

2 Jul, 2019 06:51 IST|Sakshi
జిల్లా పరిషత్‌ కార్యాలయం    

సాక్షి, అరసవల్లి(శ్రీకాకుళం) : ఐదేళ్ల పాటు ‘పరిషత్‌’లను ఏలిన పాలకులు పీఠం దిగే సమయం ఆసన్నమైంది. మండలాల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జెడ్పీ అధ్యక్షురాలి పదవీ కాలం ముగియనుంది. ఎన్ని కల నిబంధనల ప్రకారం ఈ నెల 3వ తేదీతో ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఈ నెల 4తో జెడ్పీటీసీ సభ్యులు, జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు మాజీలు కానున్నారు. జిల్లాలో అన్ని మండలా ల్లోనూ ప్రత్యేక అధికారుల పాలన రానుంది. ఇందుకోసం జిల్లా కలెక్టర్‌ జె.నివాస్, జేసీ శ్రీని వాసులు, తదితర ఉన్నతాధికారుల బృందం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే గ్రామ పంచా యతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా మండలాల్లో కూడా ప్రత్యేకాధికారుల పాలన రంగంలోకి రానుంది. జిల్లాలో ఉన్న 38 మండలాల్లో మళ్లీ ఎన్నికలయ్యేంతవరకు ప్రత్యేకాధికారులు విధుల్లో ఉండనున్నారు. తాజా పరిస్థితుల ప్రకారం జిల్లా వ్యా ప్తంగా మండల, జిల్లా పరిషత్‌ స్థాయి పాలకులు మొత్తం 753 మంది ప్రతినిధులు మాజీలు కానున్నారు.

జెడ్పీ ప్రత్యేకాధికారిగా జిల్లా కలెక్టర్‌ 
మండలాల్లో ప్రత్యేకాధికారులుగా జిల్లా స్థాయి అధికారులను నియమించేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీల్లో మండల స్థాయి అధికారులు, మండలాల్లో జిల్లా స్థాయి అధికారుల పాలన ఉండాలనే నిబంధన మేరకు చర్యలు తీసుకునేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో జిల్లాలో ఉన్న మొత్తం 37 మంది జిల్లా పరిషత్‌ ప్రాధేశిక నియోజకవర్గ సభ్యులు (జెడ్పీటీసీ), ఇద్దరు కో ఆప్షన్‌ మెంబర్లతో పాటు జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్న చౌదరి ధనలక్ష్మి కూడా ఈ నెల 4వ తేదీనే పీఠం దిగనున్నారు. అనంత రం జెడ్పీ పాలక బాధ్యతలు జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌ చేపట్టనున్నారు. దీంతో జిల్లా పరిషత్‌లో మళ్లీ పాలక వర్గం నియామకం అయ్యేంత వరకు ఇక్కడ కలెక్టర్‌ పాలన కొనసాగనుంది. ఇందుకోసం జెడ్పీలో ప్రత్యేక కార్యాలయాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. 

3న ‘పరిషత్‌’ ఓటర్ల జాబితాలు విడుదల..
జిల్లాలో అన్ని మండలాలు, జిల్లా పరిషత్‌ల్లో ప్రత్యేక అధికారుల పాలన కోసం ఓ వైపు అధికా రులు కసరత్తు చేస్తుండగా, మరోవైపు పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు కూడా ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు చర్యలకు దిగుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో మండలాల వారీగా ఈ నెల 3న ఓటర్ల జాబితాలను సిద్ధం చేయనున్నా రు. ఈ మేరకు ఎంపీటీసీల ఓటర్ల జాబితాలను ఎంపీడీవోలు, జెడ్పీటీసీల ఓటర్ల జాబితాలను జెడ్పీ సీఈవో సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పంచా యతీల్లో ఎన్నికల కోసం ఎస్సీలు, ఎస్టీలు, బీసీల వారీగా ఓటర్లను ఫొటోలు, డోర్‌ నంబర్లతో సహా సిద్ధం చేశారు. వీటి ద్వారా ఎంపీటీసీల పరిధి మేరకు అధికారులు ప్రత్యేక జాబితాలను తయారు చేయించారు. జెడ్పీటీసీల ఎన్నికలకు కూడా ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. జూలై 3వ తేదీ నాటికి ఈ జాబితాలను అందుబాటులో ఉండేలా ప్రచురణ చేయాలని సూచిం చారు. ఈ పనుల్లో అధికారులు నిమగ్నమయ్యా రు. దీంతో మండల స్థాయిలో ఎన్నిక ల వాతావరణం కన్పిస్తోంది. ఎక్కడికక్కడ చర్చలు సాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి అత్యధిక మద్దతు ఇచ్చిన రాష్ట్ర ప్రజలు, త్వరలో జరుగున్న ‘స్థానిక’ ఎన్నికల్లో కూడా పూర్తిస్థాయిలో మెజార్టీ ఇస్తారనే చర్చలు జోరందుకున్నాయి. 

అరసవల్లి: 
ఐదేళ్ల పాటు ‘పరిషత్‌’లను ఏలిన పాలకులు పీఠం దిగే సమయం ఆసన్నమైంది. మండలాల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జెడ్పీ అధ్యక్షురాలి పదవీ కాలం ముగియనుంది. ఎన్ని కల నిబంధనల ప్రకారం ఈ నెల 3వ తేదీతో ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఈ నెల 4తో జెడ్పీటీసీ సభ్యులు, జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు మాజీలు కానున్నారు. జిల్లాలో అన్ని మండలా ల్లోనూ ప్రత్యేక అధికారుల పాలన రానుంది. ఇందుకోసం జిల్లా కలెక్టర్‌ జె.నివాస్, జేసీ శ్రీని వాసులు, తదితర ఉన్నతాధికారుల బృందం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే గ్రామ పంచా యతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా మండలాల్లో కూడా ప్రత్యేకాధికారుల పాలన రంగంలోకి రానుంది. జిల్లాలో ఉన్న 38 మండలాల్లో మళ్లీ ఎన్నికలయ్యేంతవరకు ప్రత్యేకాధికారులు విధుల్లో ఉండనున్నారు. తాజా పరిస్థితుల ప్రకారం జిల్లా వ్యా ప్తంగా మండల, జిల్లా పరిషత్‌ స్థాయి పాలకులు మొత్తం 753 మంది ప్రతినిధులు మాజీలు కానున్నారు.

జెడ్పీ ప్రత్యేకాధికారిగా జిల్లా కలెక్టర్‌ 
మండలాల్లో ప్రత్యేకాధికారులుగా జిల్లా స్థాయి అధికారులను నియమించేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీల్లో మండ ల స్థాయి అధికారులు, మండలాల్లో జిల్లా స్థాయి అధికారుల పాలన ఉండాలనే నిబంధన మేరకు చర్యలు తీసుకునేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో జిల్లాలో ఉన్న మొత్తం 37 మంది జిల్లా పరిషత్‌ ప్రాధేశిక నియోజకవర్గ సభ్యులు (జెడ్పీటీసీ), ఇద్దరు కో ఆప్షన్‌ మెంబర్లతో పాటు జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్న చౌదరి ధనలక్ష్మి కూడా ఈ నెల 4వ తేదీనే పీఠం దిగనున్నారు. అనంత రం జెడ్పీ పాలక బాధ్యతలు జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌ చేపట్టనున్నారు. దీంతో జిల్లా పరిషత్‌లో మళ్లీ పాలక వర్గం నియామకం అయ్యేంత వరకు ఇక్కడ కలెక్టర్‌ పాలన కొనసాగనుంది. ఇందుకోసం జెడ్పీలో ప్రత్యేక కార్యాలయాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. 

జిల్లాలో ఉన్న మొత్తం 637 మంది మండల పరిషత్‌ ప్రాధేశిక నియోజకవర్గ సభ్యులు (ఎంపీటీసీ)తో పాటు 38 మంది మండల పరిషత్‌ అధ్యక్షులు (ఎంపీపీ), 38 మంది మండల కో ఆప్షన్‌ మెంబర్లకు కూడా ఈ నెల 3వ తేదీతో పదవీకాలం ముగియనుంది. 4వ తేదీ నుంచి మండలాల్లో ప్రత్యేక అధికారుల పాలన రానుంది.  ఇందుకోసం జిల్లా స్థాయి అధికారులను గుర్తించే పనిలో ఉన్నతాధికారులు బిజీ అయ్యారు. ఇందులో పలు అత్యవసర ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులను మినహాయింపు ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు