'తప్పని పరిస్థితుల్లోనే ఎంపీల సస్పెన్షన్'

22 Aug, 2013 21:58 IST|Sakshi

ఢిల్లీ: తప్పనిసరి పరిస్థితుల్లోనే సీమాంధ్ర ఎంపీలను  సస్పెండ్ చేసినట్లు ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ చెప్పారు. అన్ని పార్టీలతో సంప్రదించాకే ఎంపీలపై సస్పెన్షన్ వేటువేసినట్లు తెలిపారు. 15 రోజులుగా 10 మంది ఎంపీలు పార్లమెంట్‌ను స్తంభింపచేయడం భావ్యం కాదన్నారు.  ఎంపీల ఆందోళన కారణంగా సభా కార్యక్రమాలు పెండింగ్‌లో పడ్డాయన్నారు.

సస్పెన్షన్‌పై  చర్చించేందుకే స్పీకర్ రేపు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం కాంగ్రెస్ ఒక్కటే తీసుకున్న నిర్ణయం కాదన్నారు. రాజధాని, జలవనరులు, అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణకు ఇది సరైన సమయం కాదన్న బిజెపి నాయకురాలు సుష్మాస్వరాజ్  వ్యాఖ్యలు సరికావన్నారు.

మరిన్ని వార్తలు