పాఠశాలల్లో ఫీజుల మోత

2 Jun, 2014 01:29 IST|Sakshi
 • ప్రైవేట్ పాఠశాలల్లో దోపిడీ
 •  యూకేజీకి రూ.10 వేలు
 •  పదో తరగతికి రూ.20 వేల నుంచి రూ.25 వేలు
 •  మత్తు వీడని విద్యాశాఖ
 •  కోడూరు, న్యూస్‌లైన్ : పిల్లలకు ఆస్తిపాస్తులు ఇవ్వలేకపోయినా ఉత్తమ విద్యను అందించాలని నేటితరం తల్లిదండ్రులు భావిస్తున్నారు. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేలా చదివించేందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదు. వారి ఆశలనే పెట్టుబడిగా చేసుకుని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు అక్షరాలకు వెల కడుతున్నాయి.

  అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చేస్తున్నాయి. దీంతో ఉన్నతాశయంతో 2009 ఆగస్టు 27న కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘ఉచిత నిర్బంధ విద్య బాలల హక్కు చట్టం’ అపహాస్యమవుతోంది. సమాజంలోని 6 నుంచి 14 ఏళ్ల పిల్లలంతా బడిలో చేరి ఉచితంగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని రూపొందించింది. కానీ ఈ చట్టం ఒకటుందనే విషయాన్ని అధికారులు సైతం మరిచిపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది.
   
  అటకెక్కిన ఫీజుల నియంత్రణ జీవో...

  ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పదిహేనేళ్ల క్రితం జారీ చేసిన జీవో నంబర్-1 అటకెక్కింది. ఈ జీవో అమలుకు ప్రైవేట్ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పేరెంట్స్ కమిటీలు యాజమాన్యాలకు కొమ్ముకాస్తున్నాయి. కమిటీలో అనుకూలమైన పేరెంట్స్‌ను నియమించుకుని తల్లిదండ్రుల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలు చాలా ఉన్నాయి. పదేళ్ల క్రితం జిల్లాకు ఒకటి రెండు మాత్రమే ఉన్న కార్పొరేట్ విద్యాసంస్థలు.. నేడు వీధికొకటి వెలిశాయి.

  పాఠశాల విద్యను శాసించే స్థాయికి వీటి కార్యకలాపాలు విస్తరించి, ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు లేక మూతబడే స్థాయికి చేరడం ఆందోళన కలిగించే అంశం. జిల్లాలోని కొన్ని కార్పొరేట్ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీలకు ఏడాదికి రూ.10 వేల ఫీజు వసూలు చేస్తుండటం గమనార్హం. పుస్తకాలు, యూనిఫాం, పాఠశాలల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అదనంగా మరో రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ఖర్చువుతుంది.

  ఒకటి నుంచి ఏడో తరగతి వరకు హాస్టల్‌లో ఉంటే సంవత్సరానికి అదనంగా రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ముట్టజెప్పాల్సిందే. పుస్తకాలు, పరీక్ష ఫీజు, విహారయాత్రలు.. ఇలా ఏదోక రూపేణా మరో రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు.
   
  మండల స్థాయిలోనూ...
   
  నియోజకవర్గ, మండల స్థాయిలో పేరుమోసిన పాఠశాలల్లో కూడా ఫీజులు ఇదే విధంగా ఉన్నాయి. ఆ పాఠశాలల్లో ఫీజులు వింటే తల్లిదండ్రులకు పట్టపగలే చుక్కలు కనిపిచే పరిస్థితి నెలకొంది. అడ్మిషన్ల పేరిట యథేచ్ఛగా డొనేషన్లు వసూలు చేస్తున్నా అడిగే నాథుడే కరువయ్యారు. తరగతిని బట్టి అడ్మిషన్ ఫీజు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు ఉంటోంది. వాస్తవానికి ఈ ఫీజును పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ మీటింగ్‌లో చర్చించి అనుమతి తీసుకోవాల్సి ఉంది.

  దానిని డీఈవో దృష్టికి తీసుకెళ్లి వసూలు చేసుకోవాలనే నిబంధన ఉంది. ఎక్కడా ఈ నిబంధన అమలుకు నోచుకుంటున్న దాఖలాలు లేవు. ఇక జిల్లాలోని 90 శాతం పాఠశాలలకు మైదానం, పార్కింగ్ స్థలాలు లేవనేది అధికారులకు తెలియనిది కాదు. ఇంతింత ఫీజులు వసూలు చేసి విద్యార్థినీ విద్యార్థులకు తగినన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారా అంటే అదీ లేదు. అర్హులైన బీఈడీ, డీఈడీ ఉపాధ్యాయులు, ఎంఈడీ చేసిన హెచ్‌ఎంను నియమించాల్సి ఉన్నా.. ఎక్కడా వీరి ఊసే లేకపోవడం గమనార్హం.  
   
  విద్యాహక్కు చట్టంలో ఏముందంటే..
   
  ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలలు తమ పాఠశాలలో చేర్చుకున్న పిల్లల్లో కనీసం 25 శాతానికి తగ్గకుండా ఒకటో తరగతిలో పేద పిల్లలను చేర్చుకుని ఎలిమెంటరీ వరకు ఉచిత విద్యనందించాలి. ఈ ఖర్చును అన్ ఎయిడెడ్ పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.
   
  పాఠశాలలో ప్రవేశానికి ఎంపిక విధానం (అడ్మిషన్ టెస్ట్) నిర్వహించరాదు. ఇలా చేస్తే మొదటి తప్పునకు రూ.25 వేలు, ఆ తర్వాత ప్రతిసారీ తప్పునకు రూ.50 వేల చొప్పున జరిమానా విధించవచ్చు.
   
  పాఠశాలలో ప్రవేశం పొందిన పిల్లలను అదే తరగతిలో మళ్లీ కొనసాగించడం, పాఠశాల నుంచి తీసేయడం నిషిద్ధం.
   
  గుర్తింపు ధ్రువీకరణ పత్రం లేకుండా పాఠశాలను నిర్వహించరాదు.
   
  గుర్తింపు రద్దయిన తర్వాత కూడా ఏ వ్యక్తి అయినా పాఠశాలను నిర్వహిస్తే రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. ఉల్లంఘన కొనసాగితే ఆ తర్వాత ప్రతిరోజుకు రూ.10 వేల చొప్పున జరిమానా విధించవచ్చు.
   
  బాలబాలికలకు ప్రత్యేకంగా తగినన్ని మరుగుదొడ్లు నిర్మించాలి.
   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గజరాజుల మరణమృదంగం

అడ్డదారులు తొక్కుతున్న కొందరు మహిళా ఎస్‌ఐలు!

నిద్రపోతున్న నిఘా నేత్రాలు..!

గోవిందా.. వసూళ్ల దందా!

అత్యవసరమా.. అయితే రావొద్దు!

రేపు జిల్లాకు కొత్త గవర్నర్‌ రాక

రవాణా శాఖ యూనిట్లలో డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లు

లేని వారికి బొట్టు పెట్టి..

మా దారి.. రహదారి!

ఎంపీ గల్లా అనుచరులపై కేసు

బడి ముందు గుడి నిర్మాణం

ప్రేమను బతికిద్దామా! చావును ప్రేమిద్దామా?

మంచి రోజులొచ్చాయి

ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. బాలింత మృతి

సహకార రంగానికి ఊతం

హజ్‌యాత్ర విమాన షెడ్యూల్‌ ఖరారు

వేగంగా ఏసీబీ కేసుల దర్యాప్తు

పెరుగుతున్న పట్నవాసం

రుణం వద్దన్నది భారత ప్రభుత్వమే

ఉద్యోగాంధ్ర

అంతరిక్ష యవనికపై జాబిల్లికి జైత్రయాత్ర!

‘చంద్రయాన్-2’ కౌంట్ డౌన్ షురూ

ఈనాటి ముఖ్యాంశాలు

ఏపీకి సాయంపై వరల్డ్‌ బ్యాంక్‌ స్పష్టత

విద్యార్థులకు పురస్కారాలు అందజేసిన మంత్రి అనిల్‌

‘గోదావరి జిల్లా వాసుల కల నిజం చేస్తా’

‘అన్యాయం జరిగితే నన్ను కలవండి’

నిండు గర్బిణిని డోలీలో తీసుకెళ్లారు!

నీటి కేటాయింపులకు చట్టబద్దత కల్పించాలి

‘అర్చకులు బాగుంటేనే ఆలయాలు బాగుంటాయి’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి

జాన్వీకపూర్‌తో దోస్తీ..

రకుల్‌కు చాన్స్‌ ఉందా?

ఆలియా బాటలో జాక్వెలిన్‌

తమిళంలో తొలిసారి

హీరోకి విలన్‌ దొరికాడు