బురద నీటిని తాగేదెలా..?

11 Jun, 2018 12:57 IST|Sakshi
లావేటిపాలేం గ్రామంలో మంచినీటి కొళాయిలు నుంచి వస్తున్న బురదనీరు.

పట్టించుకోని అధికారులు

ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు

లావేరు: మండలంలోని లావేటిపాలేం గ్రామంలో రెండు రోజులుగా మంచినీటి కుళాయిలు నుంచి బురద నీరు వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బురద నీటిని ఎలా తాగాలని ప్రశ్నిస్తున్నారు. లావేటిపాలేం గ్రామంలో ప్లాస్టిక్‌ వాటర్‌ ట్యాంకులు ఏర్పాటు చేసి వాటి ద్వారా గ్రామంలో మంచినీటి కొళాయిలు ఏర్పాటు చేశారు. గత రెండు రోజుల నుంచి మంచినీటి కుళాయిలు నుంచి బురద నీరు వస్తోంది. దీంతో ఆ నీటిని తాగలేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా పంచాయతీ అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు