‘ముద్రగడ కాస్త సమయమివ్వాలి’

26 Jul, 2017 19:58 IST|Sakshi

అమరావతి: కాపునాడు నేత ముద్రగడ పద్మనాభం చేసే పోరాటంలో న్యాయం ఉందని మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ముద్రగడ దీక్ష వెనుక వైఎస్సార్‌ సీపీ హస్తం లేదని వివరించారు. కాపు రిజర్వేషన్ ఆలస్యం అవుతుందనే ముద్రగడ ఉద్యమం చేస్తున్నారని చెప్పారు.

ముద్రగడ ఉద్యమంతో కాపులు దాడులకు పాల్పడుతున్నారనే మంత్రుల ఆరోపణలతో తాను ఏకీభవించటం లేదన్నారు. కాపుల ఉన్నతి కోసం పోరాటం చేస్తున్న ముద్రగడ.. రిజర్వేషన్ల అమలుకు కాస్త సమయమివ్వాలని సూచించారు.

మరిన్ని వార్తలు