'బాబుతో సహా కేబినెట్ మోసపూరితంగా వ్యవహారిస్తోంది'

1 Feb, 2015 12:48 IST|Sakshi
'బాబుతో సహా కేబినెట్ మోసపూరితంగా వ్యవహారిస్తోంది'

తణుకు: రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేయకుండా ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన మంత్రి వర్గం సహచరులు మోసపూరితంగా వ్యవహారిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎం. ప్రసాదరాజు ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తణుకులో చేపట్టిన రైతు దీక్ష స్థలి ఆదివారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్బంగా ఎం. ప్రసాదరాజు మాట్లాడారు.

ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి పాదయాత్ర ద్వార ప్రజల కష్టాలు తెలుసుకుని... రుణాలు మాఫీ, పావలా వడ్డీకే రుణాలు వంటి అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని ప్రసాదరాజు ఈ సందర్బంగా గుర్తు చేశారు.

అలాగే గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వ్యవసాయం తీవ్ర వడిదుకులు ఎదుర్కొందని చెప్పారు. ఆ తర్వాత సీఎం అయిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయ రంగాన్ని పురోగామి దిశగా నడిపించారని చెప్పారు. నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ధాన్యం ఉత్పత్తిలో రెండో స్థానానికి చేరిందంటే ఆ ఘనత మహానేతకే చెందుతుందని ప్రసాదరాజు తెలిపారు.

>
మరిన్ని వార్తలు