ముక్కంటి ఆలయంలో ఉగాది వేడుకలు

1 Apr, 2014 01:55 IST|Sakshi

శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: శ్రీ జయనామ తెలుగు సంవత్సర ఉగాది వేడుకలను ముక్కంటి ఆలయంలో సోమవారం వేడుకగా నిర్వహించారు. ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సంవత్సరాది సోమవారం రావడంతో ఆలయంలో స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం పెద్దఎత్తున భక్తులు తరలివచ్చా రు. స్వామి, అమ్మవార్లతో పాటు సంకల్పసిద్ధి వినాయకస్వామి, చెంగల్వరాయస్వామి, గురుదక్షిణామూర్తి,కంచుకడప, సుపథ మండపం, ధ్వజస్తంభం సన్నిధానాన్ని శోభాయమానంగా అలంకరించారు.

బెంగళూరు నుంచి తెప్పించిన పుష్పాలతో పాటు, మామిడి, అరటితోరణాలతో తీర్చిదిద్దారు. ఇక గోపురాలను విద్యుద్దీలతో అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు విశేష అభిషేకాలు చేశారు. కాగా అలంకార మండపంలోని ఉత్సవర్లకు పలు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కల శపూజలు జరిపారు. భక్తులకు ఉగాది పచ్చడిని పంచి పెట్టారు. సాయంత్రం 5 గంటలకు దేవస్థానం ఆస్థాన జ్యోతిష్య పండితుడు శ్రీములుగు రామలింగవరప్రసాద్ పంచాంగ శ్రవణం జరిపించారు.

రాత్రి 8 గంటల కు సింహాసనంపై స్వామివారు, చప్పరంపై అమ్మవారు పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. అనుబంధ ఆలయాలైన ముత్యాలమ్మ, వరదరాజులస్వామి ఆల యాల్లోను ప్రత్యేక అలంకరణతో పాటు పూజలు, అభిషేకాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రామచంద్రారెడ్డితో పాటు ఈఈ రామిరెడ్డి, ఇన్‌స్పెక్ట ర్లు వెంకటేశ్వరరాజు, హరిబాబు యాదవ్, పీఆర్వో సుదర్శన్‌నాయుడు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు