డిసెంబర్‌లో మున్సిపల్‌ ఎన్నికలు! : మంత్రి బొత్స

12 Sep, 2019 13:02 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకుచ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. గురువారం విజయవాడలో మున్సిపల్‌ కమిషనర్‌ల వర్క్‌షాప్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన బొత్స మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒకేసారి నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయలేదని, జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షల ఉద్యోగాలను ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తున్నారని గుర్తు చేశారు. సీజనల్‌ వ్యాధులు రాకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. చాలా మంది అధికారులు ప్రజలు ఫోన్‌ చేస్తే ఫోన్‌ ఎత్తట్లేదని, స్పందన కార్యక్రమంపై అధికారులు రాజీ పడడానికి వీల్లేదన్నారు.

స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిచ్చి డ్రైనేజీ వ్యవస్థ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పట్టణాల్లో నీటి కొరత రాకుండా చూడాల్సిన అవసరముందన్నారు. వచ్చే ఉగాదికి ఇళ్ల పట్టాలివ్వాలని సీఎం నిర్ణయించినందున ఈ కార్యక్రమం కోసం వార్డు వలంటీర్లు, గ్రామ సచివాలయం అధికారుల సేవలను మున్సిపల్‌ అధికారులు వినియోగించుకోవాలన్నారు. చాలామంది కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయమని అడుగుతున్నారనీ, ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరోవైపు డిసెంబర్‌లో మున్సిపల్‌ ఎన్నికలు వచ్చే అవకాశముందని బొత్స పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలువురు మున్పిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఓ మంచి ఆర్గానిక్‌ కాఫీ..!

రొట్టెల పండగలో రాష్ట్రమంత్రులు

‘అది తెలిసే చంద్రబాబు చిల్లర వేషాలు’

రమణమ్మ కుటుంబాన్ని ఆదుకుంటాం

మండలానికో జూనియర్‌ కాలేజీ

ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద

అప్పుడు కిలిమంజారో... ఇప్పుడు ఎల్‌బ్రూస్‌

రౌడీని స్పీకర్‌ను చేసిన ఘనత చంద్రబాబుది

'బెడ్డు'మీదపల్లె

తర'గతి' మారనుంది

హాస్టల్‌ విద్యార్థులకు తీపి కబురు

‘మోడల్‌’కు మహర్దశ

అనుమతి ఒకలా.. నిర్మాణాలు మరోలా

వాహనదారులు అప్రమత్తం

పరారీలో ఏ1 నిందితుడు మాజీమంత్రి సోమిరెడ్డి

ప్రియుడి చేత భర్తను చంపించిన భార్య

లేచింది మహిళాలోకం..

ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఫలితాలు విడుదల

సిగ్నల్‌ టవర్‌పైకి ఎక్కి యువకుల నిరసన!

నోరు పారేసుకుంటున్న టీడీపీ నేతలు

తొలగనున్న ‘భూ’చోళ్ల ముసుగు

మద్యం షాపులో పనిచేస్తా.. నిషేధానికి కృషి చేస్తా

టీడీపీ ఉనికి కోసమే డ్రామాలు

టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్థి, ప్రజా సంఘాలు!

హలో గుడ్‌ మార్నింగ్.. నేను మీ ఎమ్మెల్యే

అనంతపురంలో ప్రత్యక్షమైన గిల్‌క్రిస్ట్

ట్రెండ్‌ సెట్‌ చేస్తున్నారు..

పాస్‌బుక్‌ కావాలంటే ‘రెవెన్యూ’ ఇచ్చుకోవాల్సిందే!

కదిరి టీడీపీ ఇన్‌చార్జ్‌ కందికుంటకు షాక్‌!

పడిపోయిన టమాట ధర!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

స్టార్ హీరోకు హ్యాండిచ్చిన మరో హీరోయిన్‌

కోరుకున్నది ఇస్తాడు..

అది నాకు తెలుసు!

రాఘవ లారెన్స్‌ పేరుతో మోసం

అసిన్‌ కూతురి ఫొటో వైరల్‌

మరింత యవ్వనంగా..