మూడోరోజు జోరు

13 Mar, 2014 03:00 IST|Sakshi

 సాక్షి, ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు జోరందుకున్నాయి. నామినేషన్లు ప్రారంభమైన తొలి రెండురోజులు ఈ ప్రక్రియ మందకొడిగా సాగింది. మూడోరోజు బుధవారం అభ్యర్థులు ఉత్సాహంతో నామినేషన్లు వేశారు. ఇల్లెందు, కొత్తగూడెం, మధిర, సత్తుపలి నగర పంచాయతీలకు మొత్తం 118 నామినేషన్లు దాఖలయ్యాయి. కానీ మధిరలో తొలిరోజు  నామినేషన్ల స్వీకరణ నుంచి ఇప్పటి వరకు ఒకటే నామినేషన్ దాఖలవడం గమనార్హం.

 ఈనెల 10 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనా రెండు రోజులు మాత్రం నామినేషన్లు అంతగా దాఖలు కాలేదు. బుధవారం మంచిరోజు కావడంతో అభ్యర్థులు కోలాహలంగా నామినేషన్లు దాఖలు చేశారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డులకు 40 నామినేషన్లు, ఇల్లెందులో 53, సత్తుపల్లిలో 24 నామిషన్లు దాఖలు కాగా మధిరలో మాత్రం ఒకే ఒక నామినేషన్ వేశారు. మధిర నగరపంచాయతీ పరిధిలో 20 వార్డులు ఉన్నాయి. పదో వార్డుకు స్వతంత్ర అభ్యర్థిగా తిమ్మినేని రామారావు నామినేషన్ దాఖలు చేశారు. రెండు రోజులుగా ఒక నామినేషన్ కూడా దాఖలు కాలేదు.

 నామినేషన్ల స్వీకరణ నుంచి ఇప్పటి వరకు పార్టీల పరంగా ఒక్క అభ్యర్థి కూడా మధిర నగర పంచాయతీలోని వార్డులకు నామినేషన్ వేయలేదు. స్థానికంగా పొత్తులు ఇంకా ఖరారు కాకపోవడంతో బరిలో నిలవాలనుకుంటున్న అభ్యర్థులు హైరానాపడుతున్నారు. వార్డు సభ్యుడిగా తమకు అవకాశం కల్పించాలని ఆశావాహులు తమ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్తగూడెం, సత్తుపల్లిలో ఎస్సీ, ఎస్జీ జనరల్, మహిళలకు రిజర్వు అయిన వార్డుల్లో అసలు అభ్యర్థులు దొరకక పార్టీల నేతలు వెదుకులాట ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలు కూడా లేకపోవడంతో ఏమి చేయాలో నేతలకు పాలుపోవడం లేదు.

రిజర్వు అయ్యి పార్టీ పరంగా కార్యకర్తలు లేనిచోట...అసలు పార్టీల్లో తిరగని విద్యావంతులపై నేతలు కన్నేశారు. తుది గడువు నాటికి వారిని ఒప్పించి నామినేషన్ వేయించడానికి కసరత్తు చేస్తున్నారు. నామినేషన్ల స్వీకరణ తుది గడువు దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల విషయంలో పలు పార్టీలది ఇదే పరిస్థితి. ఇప్పటికే ఖరారైన వారు చివరిరోజు 14న సందడితో నామినేషన్లు వేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అఖిలపక్ష భేటీ: ఢిల్లీ చేరుకున్న వైఎస్‌ జగన్‌

బీపీఓలను గ్రామస్థాయికి విస్తరిస్తాం : మంత్రి గౌతమ్‌రెడ్డి

వీరింతే.... మారని అధికారులు

ఉపాధ్యాయుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

‘మృగశిర’ మురిపించేనా!

ర్యాగింగ్‌ చేస్తే...

డీఎస్సీ–18 అభ్యర్థులకు శుభవార్త

జాదూగర్‌ బాబు చేశారిలా..

ట్రాన్స్‌ఫార్మర్‌ అడ్డొచ్చిందని..!

అన్నిచేసి.. ఇప్పుడేమో నంగనాచి డ్రామాలు

ఆయుష్షు హరించారు!

తాగి ఊదితే...  ఊచల వెనక్కే!

ఒత్తిడి నుంచి ఉపశమనం..

కోడెల తనయుడి మరో నిర్వాకం

అధికారులు పరువు తీస్తున్నారు!

ఎట్టకేలకు ఆ డీఎస్సీకి మోక్షం!

బెల్టు తీయాల్సిందే

కొత్తది ఉన్నా ఇంకా పాతదానిలోనే..

అసెట్‌.. అడ్మిషన్లు ఫట్‌!

తింటే తంటాయే! 

లెక్క తేలాల్సిందే!

కోడెల వ్యవహారంపై టీడీపీ కీలక నిర్ణయం!

నాడు ఆధ్యాత్మిక గురువు.. నేడు అనాథ

ఏటీఎం@ మోసం

ఈ భోజనం మాకొద్దు

సీఎం ప్రకటనతో సంజీవనికి ప్రాణం

మగబిడ్డ పుట్టాడని ఆనందం..కానీ అంతలోనే

ఇక రిజర్వేషన్ల కుస్తీ..!

పట్టాలెక్కని సౌకర్యాలు 

దారుణం : 70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారయత్నం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రభాస్‌ నెక్ట్స్ ఎవరితో..?

రాజ్‌ తరుణ్‌ కొత్త సినిమా ప్రారంభం

‘సంపూ’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే!

రెక్కల సివంగి

ఏడేళ్లుగా ఇదే ఫిట్‌నెస్‌తో ఉన్నా!

ఫ్లాప్ డైరెక్టర్‌తో సాయి ధరమ్‌ తేజ్‌!