జీవో 151 అమలు చేయాల్సిందే

11 Jul, 2018 11:15 IST|Sakshi
 ధర్నా చేస్తున్న కార్మికులు

ద్వారకానగర్‌ (విశాఖ దక్షిణ): మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు కనీస వేతనం రూ.18కు పెంచుతూ విడుదల చేసిన జీవో నంబరును 151ను అమలు చేయాలని మున్సిపల్‌ కార్మికులు డిమాండ్‌ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. విశాఖ మున్సిపల్‌ వర్కర్ల యూనియన్‌ అధ్యక్షుడు జి.సుబ్బారావు, గౌరవ అధ్యక్షుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ కనీస వేతనం పెంచుతూ విడుదలైన జీవోను రెండేళ్లయినా జీవీఎంసీ అధికారులు అమలు చేయకపోవడం దారుణమన్నారు.

వేతనాలు పెంచడానికి చర్య తీసుకోని అధికారులు పారిశుధ్యం పనులను ప్రైవేటికరించడానికి ఉద్దేశించిన జీవో 279ను మాత్రం అమలు చేయడం బాధాకరమన్నారు. జీవో 279ను వెంటనే రద్దు చేయాలని, జీవో 151ను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలన్నారు. కార్మికులకు ఇవ్వవలసిన గ్లౌజ్‌లు, సబ్బులు, షూ, నూనె వెంటనే పంపిణీ చేయాలన్నారు. కార్మికులు సమస్యలు పరిష్కరించని పక్షంలో ఈ నెల 15వ తేదీ తర్వాత సమ్మె దిగుతామని హెచ్చరించారు. ధర్నాలో సీఐటీయూ జి ల్లా మాజీ అధ్యక్షుడు అజశర్మ, సీఐటీయూ నగర అధ్యక్షుడు కుమార్, యూనియన్‌ నాయకులు నాగేశ్వరరావు, రాజు, నాయుడు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు