జాతరో జాతర

31 Jan, 2014 04:28 IST|Sakshi

 ‘పరిశుభ్రత’లో జిల్లాకు బహుమతులు
 జగిత్యాల అర్బన్/హుజూరాబాద్‌టౌన్, న్యూస్‌లైన్ : మున్సిపాలిటీలను పరిశుభ్రంగా తీర్చిదిద్దినందుకు జగిత్యా ల మున్సిపాలిటీ, హుజూరాబాద్ నగర పంచాయతీకి బహుమతులు లభించాయి. బల్దియాలను క్లీన్‌సిటీగా మార్చాలనే ఉద్దేశంతో ఇటీవల ప్రభుత్వం చెత్తపైకొత్త సమరం కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ‘100 డేస్ క్లీన్‌సిటీ ఛాలెంజ్ అండ్‌గోల్డెన్ వీక్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
 
 రాష్ట్రవ్యాప్తంగా 128 మున్సిపాలిటీలు నామినేషన్ వేయగా.. ఇందులో 27 మున్సిపాలిటీలు ఎంపికయ్యాయి. వీటిలో జగిత్యాల మున్సిపాలిటీ కూడా ఒకటి. ఈ క్రమంలో ఫోర్త్ ఇంటర్‌నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సోయిల్డ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ హైదరాబాద్ జాయింట్ డెరైక్టర్ ఇ టీవల పట్టణాన్ని సందర్శించారు. వరంగల్ రీజియన్‌లోనే మున్సిపాలిటీకి రెండోస్థానం కల్పించి బెస్ట్ ఇంప్లిమెంటేషన్ అవార్డు ప్రకటించారు.
 
 హుజూరాబాద్‌కు ఫోర్త్ ఐకాన్ ఇంటర్నేషనరల్ అవార్డు
 హుజూరాబాద్ నగరపంచాయితీకి ఫోర్త్ ఐకాన్ ఇంటర్నేషనల్ అవార్డు లభించింది. కమిషనర్ గంగారాం ఆధ్వర్యంలో 65 రోజులుగా పట్టణంలో పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 28 నుంచి 30 తేదీ వరకు  హైదరాబాద్‌లోని ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయంలో  శిక్షణ  తరగతులు నిర్వహించారు. గురువారం ముగింపు సమావేశం లో అవార్డులను మున్సిపల్ శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి, గవర్నర్ నరసింహన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేట్ కమిషన్ డెరైక్టర్ చేతులమీదుగా జగిత్యాల మున్సిపాలిటీ కమిషనర్ జీఆర్.సురేశ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ వెంకటస్వామి, పర్యావరణ ఇంజినీర్ లావణ్య, హుజూరాబాద్ నగర పంచాయతీ కమిషనర్  గంగారాం అందుకున్నారు.
 
 కోహెడలోని శ్రీప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీనర్సిసింహస్వామి జాతర జన సంద్రమైంది. స్వామివారిని దర్శించుకునేందుకు జిల్లాతోపాటు మహారా ష్ట్ర రాష్ట్రంలోని ముంబ యి, పుణే, షోలాపూర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. తూర్పు నుంచి పడమరకు పారే సెలయేటిలో స్నానాలు చేశారు. ఎతైయిన కొండపై, చీకటి గుహలో కొలువుదీరిన స్వామివారిని దర్శించుకున్నారు. సింగరాయకొండను పర్యాటక ప్రాంతంగా గుర్తించేందుకు కృషి చేస్తామని జెడ్పీ సీఈవో చక్రధర్‌రావు తెలిపారు. గురువారం స్వామివారిని దర్శించుకున్నారు.                     
 - న్యూస్‌లైన్, కోహెడ
 

మరిన్ని వార్తలు