రూ.20 వేల కోసం మేనల్లుడి హత్య

5 Feb, 2014 20:16 IST|Sakshi
రాజ్‌కుమార్‌ మేనమామ వినోద్

హైదరాబాద్: నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఐదేళ్ల బాలుడు యాశ్‌ రాజ్‌కుమార్‌ హత్య కేసులో అత్తాపూర్‌కు చెందిన వినోద్‌ను  పోలీసులు అరెస్ట్ చేశారు. 20 వేల రూపాయల కోసం హత్య చేసినట్లు రాజ్‌కుమార్‌ మేనమామ వినోద్‌ పోలీసులకు చెప్పాడు.  మంగళ్‌హాట్‌ ధూల్‌పేట్‌ ప్రాంతానికి చెందిన అనిల్‌ కుమార్, పప్పి దంపతుల కుమారుడు యశ్‌రాజ్ కుమార్ నార్సింగ్‌లోని పిరంచెరువు సమీపంలో గత నెలలో  దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే.   

నాంపల్లి ఝాన్సీ చౌరాహీలోని కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌లో ఎల్‌కెజి చదువుతున్న యాశ్‌ రాజ్‌కుమార్‌ సొంత మేనమామ వినోద్   ఇరవై వేల రూపాయల కోసం కిడ్నాప్ చేసి, హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.   బాలుడి గొంతుకు ఉరి బిగించి హత్య చేసి, ఆ తర్వాత బండరాయితో ముఖంపై మోదారు. ఆ తర్వాత పెట్రోల్ పోసి శవాన్ని తగులబెట్టారని పోలీసులు తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు