జమాత్‌కు దూరంగా.. జకాత్‌కు దగ్గరగా

26 Apr, 2020 11:01 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

రంజాన్‌ను స్వాగతించిన ముస్లింలు

రోజుకు ఐదు పూటలా నమాజుతో పాటు ఉపవాసాలు 

ఇళ్లలోనే సహెర్, ఇఫ్తార్, నమాజ్‌లు 

కర్నూలు(అర్బన్‌): పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభమైంది. ఉపవాస దీక్షలకు ముస్లింలు ఉపక్రమించారు. నెలరోజుల పాటు ఐదుపూటలా నమాజు చేస్తారు. ఈ మాసంలో ఏ కార్యం చేసినా పుణ్యం 70 రెట్లు అధికంగా ఉంటుందని దివ్య ఖురాన్‌తో పాటు హదీసుల్లో పేర్కొన్నారు. ఎవరిపైనా కోప పడకుండా, కొట్లాడకుండా ప్రశాంత చిత్తంతో అల్లాను ఆరాధించాలి. లాక్‌డౌన్‌ నిబంధనలను గౌరవిస్తూ రంజాన్‌ పుణ్య కార్యాలు ఆచరించాల్సిన అవసరం ఉంది. సాధారణంగా నమాజ్‌ జమాత్‌తో (సామూహికంగా) చేయాలనేది శ్రేష్టమైన విధానమని పేర్కొంటారు. అయితే ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా జమాత్‌తో కాకుండా వ్యక్తిగతంగా ఇళ్లలోనే నమాజు  చేయడం ద్వారా పుణ్యం ఏమాత్రమూ తగ్గదని ఆలిమ్‌లు పేర్కొంటున్నారు.  

ఉపవాస వస్తువుల కొనుగోలుకు వెసులుబాటు.. 
రంజాన్‌ మాసం కావడంతో ఉపవాస దీక్షలకు అవసరమైన వస్తువుల కొనుగోలుకు ప్రభుత్వం ఉదయం 10 గంటల వరకు వెసులు బాటు కలి్పంచింది. పుణ్యకార్యాల్లో భాగంగా ఎవరైనా సహెర్‌కు ఆహారం సమరి్పంచాలనుకుంటే తెల్లవారు జామున 3 నుంచి 4.30 గంటల వరకు ఉండే సమయంలోనే భౌతిక దూరం పాటిస్తూ పూర్తి చేసుకోవాలి. అలాగే ఇఫ్తార్‌కు సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు వెసులుబాటు ఉంటుంది. 

సడలింపులు ఇచ్చాం.. 
ప్రభుత్వ ఆదేశాల మేరకు రంజాన్‌ మాసంలో లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు ఇచ్చామని జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు. మసీదులో ఇమామ్, మౌజన్, మరో ముగ్గురు కమిటీ సభ్యులు (మొత్తం ఐదుగురు) నమాజ్‌ చేసుకోవచ్చన్నారు. జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ధ్రువీకరించిన ఇమామ్, మౌజన్లకు ఇంటి నుంచి మసీదులకు వెళ్లేందుకు పాసులు ఇస్తారన్నారు.  గుర్తించిన హోటళ్ల ద్వారా సహెర్, ఇఫ్తార్‌ సమయంలో కేవలం పార్శిల్స్‌ మాత్రమే ఇచ్చేందుకు అనుమతి ఉంటుందని తెలిపారు. ‘జకాత్‌’కు సంబంధించి పేదవారి ఇంటికి సరుకులు చేర్చాలని, బహిరంగ ప్రదేశాల్లో, దాతల ఇళ్ల వద్ద సరుకులు పంచరాదని సూచించారు. క్వారంటైన్‌ సెంటర్లలో ఉంటున్న ముస్లింలకు సహెర్, ఇఫ్తార్‌ సమయంలో నాణ్యమైన పౌష్టికాహారం, పండ్లు, డ్రైఫ్రూట్స్‌ సమకూరుస్తున్నట్లు చెప్పారు.   

భౌతిక దూరాన్ని పాటిద్దాం
ఐదు పూటలా మసీదుల నుంచి ఆజాన్‌ పిలుపు వినిపిస్తుంటుంది. ఇమామ్,    మౌజన్‌లు మసీదులో నమాజ్‌ చేస్తారు. లాక్‌డౌన్‌ నిబంధనల మేరకు భౌతిక దూరం పాటించాల్సి ఉంది. నమాజులు ఇళ్లల్లోనే చేయాలి. ఇది నా ఒక్కరి నిర్ణయం కాదు. దేశంలోని మౌలీ్వలు,  మతపెద్దలందరు కలసికట్టుగా తీసుకున్న నిర్ణయం. ప్రభుత్వం  కలి్పంచిన వెసులుబాటును సది్వనియోగం చేసుకుందాం.                  
– ముఫ్తి అబ్దుస్‌సలాం, ప్రభుత్వ ఖాజీ   

మరిన్ని వార్తలు