ఆగస్టులోపు ముత్తిమర్రి ప్రాజెక్టు పూర్తి: దేవినేని

12 May, 2016 17:49 IST|Sakshi

పగిడ్యాల: కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం ముత్తిమర్రి గ్రామంలోని ముత్తిమర్రి ఎత్తిపోతల పథకం పనులను భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గురువారం పరిశీలించారు. ఆగస్టులోపు పంపులు ఏర్పాటు చేసి కాల్వలకు నీరు అందించేలా పనులను వేగవంతం చేయాలని ఆయన కాంట్రాక్టర్‌ను, అధికారులను ఆదేశించారు. పట్టిసీమల ఎత్తిపోతల పథకం మాదిరి దీన్ని కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ఆయకట్టకు నీరందిస్తామన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు