చంద్రబాబు కరుడుగట్టిన రైతు వ్యతిరేకి

10 Jan, 2020 17:03 IST|Sakshi

వ్యవసాయ మిషన్‌ వైఎస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కరుడుగట్టిన రైతు వ్యతిరేకి అని ఏపీ వ్యవసాయ మిషన్‌ వైఎస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి మండిపడ్డారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్‌ను ఎగతాళి చేయడంతో పాటు సాగునీటి ప్రాజెక్టులు దండగ అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. చంద్రబాబు చేస్తోన్న ఉద్యమాలు రైతుల కోసమా.. ఆయన బినామీ ఆస్తులను కాపాడుకోవడం కోసమా  అని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని.. రైతు భరోసా పథకాన్ని అమలు చేయడంతో పాటు, తొమ్మిది గంటలు విద్యుత్‌ను అందిస్తున్నారని చెప్పారు.

రాజధాని రైతులకు ఎలాంటి అన్యాయం చేయలేదని స్పష్టం చేశారు. రాజధాని తరలిస్తామని ఎవ్వరు చెప్పలేదని.. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని మాత్రమే చెప్పారన్నారు.  అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామన్నారని.. ఏ కమిటీలోనూ అమరావతి నుంచి రాజధానిని తరలిస్తామని చెప్పలేదన్నారు. రైతుల సమస్యలపై చర్చించి పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రైతులు తమ సమస్యలను హై పవర్‌ కమిటీ దృష్టికి తీసుకురావాలని.. ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా రైతులు కు మేలు చేసే విధంగా వైఎస్‌ జగన్‌ పరిపాలన అందిస్తున్నారని నాగిరెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు