43 లక్షల మందికి ‘వైఎస్సార్‌ రైతు భరోసా’

18 Nov, 2019 14:25 IST|Sakshi

అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ రైతు భరోసా పథకం ద్వారా 43 లక్షల మందికి సాయం అందించామని అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతు భరోసా పథకానికి కౌలు రైతులు దరఖాస్తు చేసుకోవడానికి మరో నెల పొడిగించామని చెప్పారు. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకానికి  అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. మార్కెటింగ్ సీజన్ ప్రారంభం అయ్యిందని, పత్తి కొనుగోలుకు సీసీఏ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. వేరుశనగకు కూడా త్వరలో ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.

ధరల స్థిరీకరణ విషయంలో నిరంతరం సమీక్ష చేస్తున్నామన్నారు. పొలంబడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామన్నారు. అపరాల బోర్డు ఏర్పాటు చేయబోతున్నామని.. వాటికి కూడా గిట్టుబాటు ధర కల్పిస్తామని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకానికి నాణ్యమైన గుడ్లు సరఫరా చేయాలని సీఎం ఆదేశించారని.. దానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియలో నేరుగా రైతులే పాల్గొనేందుకు చర్యలు చేపడతామన్నారు. బయో ప్రొడక్ట్స్ పేరుతో మోసాలు జరుగుతున్నాయని రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, దానిపై కూడా చర్యలు చేపట్టేందుకు చర్చిస్తామన్నారు. కౌలు రైతుల విషయంలో రికార్డుల సమస్యలు ఉన్నాయని..వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నామని ఎంవీఎస్‌ నాగిరెడ్డి వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు