‘కనీవినీ ఎరుగని స్థాయిలో కరువు’

3 Aug, 2018 11:59 IST|Sakshi

సాక్షి, విజయవాడ : రాష్ట్రవ్యాప్తంగా కరువు ఊహించని స్థాయిలో ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎంవీఎస్‌ నాగిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్సార్‌ కడపతో పాటు మరో ఆరు జిల్లాల్లో వర్షపాతం అతి తక్కువగా నమోదైందని తెలిపారు. అయినా కూడా కేబినెట్‌ భేటీలో కరువుపై చర్చించకపోవడం దారుణమని అన్నారు.

వర్షాభావ పరిస్థితులపై అధికారిక లెక్కలున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. లక్షల హెక్టార్లలో పంటలు ఎండిపోతున్నాయి, సాగు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టిసీమ నీళ్లు అంటూ గొప్పలు చెబుతున్నా కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోతున్నాయని వెల్లడించారు. దాదాపు 20 లక్షల హెక్టార్ల భూమి బీడుగా మారిందని వివరించారు.

ధరల స్థిరీకరణ నిధికి కేటాయింపులు ఏవని నిలదీశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయరా అని ప్రశ్నించారు. రాయలసీమ పూర్తిగా దుర్భిక్షం ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. రాయలసీమలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెయిన్‌ గన్స్ ఏమయ్యాయి? నిలదీశారు. చంద్రబాబు రైతులను పూర్తిగా వంచించారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు