మానవత్వం చాటిన ఎమ్మెల్యే

16 Jun, 2019 11:20 IST|Sakshi

సాక్షి, మైదుకూరు(కడప) : బ్రహ్మంగారిమఠం మండలంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి వెళుతూ అప్పుడే జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడి పట్ల మానవత్వం చూపారు. వివరాలు ఇలా ఉన్నాయి. బి.మఠం మండలంలోని పెద్దిరాజుపల్లెలో రాజన్న బడిబాట కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి జీవీ సత్రం మీదుగా కారులో వెళుతున్నారు.

జెడ్పీ హైస్కూల్‌ సమీపంలో మోటారు సైకిల్‌ను లారీ ఢీ కొనడంతో మోటారు సైకిల్‌పై వెళుతున్న ఇద్దరిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన జరిగిన కొద్ది నిమిషాలకే అటుగా వెళుతున్న ఎమ్మెల్యే కారును ఆపి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. బాధితుడి వివరాలు తెలుసుకున్నారు. బి.కోడూరు మండలం మేకవారిపల్లెకు చెందిన గురవయ్య అని తెలుసుకున్నారు. బాధితుడి పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చికిత్స కోసం రూ.10వేలు నగదును అందజేశారు. సంఘటన స్థలం వద్దకు చేరుకున్న పరిసరాల్లోని ప్రజలు ఎమ్మెల్యే ఔదార్యాన్ని ప్రశంసించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు