'విద్యుత్ ఛార్జీల పెంపు వెనక అవినీతి'

11 Feb, 2015 15:05 IST|Sakshi
'విద్యుత్ ఛార్జీల పెంపు వెనక అవినీతి'

హైదరాబాద్: ఏపీ విద్యుత్ ఛార్జీల పెంపు వెనుక పెద్ద అవినీతి జరుగుతోందని వైఎస్ఆర్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైసూరా రెడ్డి ఆరోపించారు. అధిక ధరకు విద్యుత్ కొనుగోళ్లపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బొగ్గు దిగుమతుల్లో కూడా భారీ అవకతవకలు జరిగాయంటూ మైసూరా రెడ్డి విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెంపుభారం ప్రజలపై పెట్టడం దుర్మార్గమంటూ దుయ్యబట్టారు.

ఏపీ సర్కార్ బాధ్యతా రహితంగా వ్యవహరిస్తోందంటూ ధ్వజమెత్తారు. విద్యుత్ లోటు కేవలం అంకెల గారడి తప్ప నిజమైన భారం కాదన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపును వైఎస్ఆర్ సీపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. అవినీతి, దుబార, స్వలాభం కోసమే విద్యుత్ కొనగోళ్లు జరుగుతున్నాయని మైసూరా రెడ్డి అన్నారు.

మరిన్ని వార్తలు