రాయలసీమలో కరువు విలయతాండవం 

27 Dec, 2018 02:54 IST|Sakshi

మైసూరారెడ్డి ఆవేదన  

సాక్షి, హైదరాబాద్‌:  రాయలసీమలో రెండు, మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితుల నెలకొన్నాయని, కరువు విలయతాండవం చేస్తోందని, ప్రజల పరిస్థితి దారుణంగా మారిందని మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ వడ్డమాను శివరామకృష్ణారావు, డాక్టర్‌ మదన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. వారు బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.

రాయలసీమ దుర్భిక్ష పరిస్థితులు, నీటి వనరుల కేటాయింపులపై ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వేర్వేరుగా రాసిన లేఖలను విడుదల చేశారు. కరువు వల్ల పంటల నష్టం జరిగినా బాధిత రైతాంగానికి వ్యవసాయ బీమా సౌకర్యం లభించలేదని బాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని వాపోయారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు