పోలవరానికి నాబార్డు రుణం

27 Sep, 2016 02:41 IST|Sakshi
పోలవరానికి నాబార్డు రుణం

- 2014 గణాంకాల ప్రకారం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు
- అక్టోబర్ 15న తొలి విడత నిధులు: సుజనా చౌదరి

 సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి 2014 అంచనా వ్యయం ప్రకారం నిధులు విడుదల చేయనున్నట్టు కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కేంద్రం నాబార్డు నుంచి రుణంగా పొంది.. కేంద్ర సంస్థ అయిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అందించనుంది. ఈ మేరకు నాబార్డ్-పోలవరం ప్రాజెక్టు డెవలెప్‌మెంట్ అథారిటీకి మధ్య ఒప్పదం కుదిరింది. ప్రాజెక్టుకు నిధుల విడుదల, వినియోగ పత్రాల సమర్పణ తదితర అంశాలపై సోమవారం ఢిల్లీలో సుజనా చౌదరి సమక్షంలో నాబార్డ్-పోలవరం అథారిటీ-రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.

నాబార్డ్ చైర్మన్ హర్షకుమార్ భన్వాల్, రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రమేష్, రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఇతరఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం సమావేశ వివరాలను సుజనాచౌదరి మీడియాకు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం వంద శాతం నిధులు సమకూర్చనుందన్నారు. దీనికి సంబంధించి అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించామన్నారు.

మరిన్ని వార్తలు