సవరణలపై ఓటింగ్ జరిగింది

28 Dec, 2013 01:45 IST|Sakshi
సవరణలపై ఓటింగ్ జరిగింది

* బీహార్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై స్పీకర్ మనోహర్‌కు వివరించిన ఆ రాష్ట్ర అధికారులు
* పాట్నాలో బీహార్ అసెంబ్లీ స్పీకర్, వుంత్రులతో నాదెండ్ల భేటీ
* అసెంబ్లీలో చర్చ తీరుతెన్నులపై అధ్యయనం
* అక్కడినుంచి ఢిల్లీకి చేరుకుని పార్లమెంటు అధికారులతో భేటీలు
 
సాక్షి, హైదరాబాద్: బీహార్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఆ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన చర్చల సరళిని రాష్ట్ర స్పీకర్ నాదెండ్ల మనోహర్, అసెంబ్లీ అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఉత్తరప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఆ రాష్ట్ర స్పీకర్, అసెంబ్లీ అధికారులతో గురువారం చర్చలు జరిపిన మనోహర్ బృందం అదే రోజు రాత్రి పాట్నాకు చేరుకుంది. శుక్రవారం పాట్నాలో బీహార్ అసెంబ్లీ స్పీకర్ ఉదయ్‌నారాయణ్ చౌదరి, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి విజయేంద్ర ప్రసాద్‌యాదవ్, మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి పీకే షాహిలతో వునోహర్ భేటీ అయ్యూరు.

రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి రాజాసదారాం, ఇతర అధికారులు, బీహార్ ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి, శాసనసభ కార్యదర్శి ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీహార్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చకు అనుసరించిన విధానాన్ని, చర్చలు సాగిన తీరును ఆ రాష్ట్ర అధికారులు వునోహర్ బృందానికి వివరించారు. బిల్లుపై సభ్యులు అనేక సవరణలు ప్రతిపాదించారని, మూజువాణీ ఓటింగ్‌కూడా జరిగిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన అసెంబ్లీ రికార్డులనుకూడా సమావేశంలో పెట్టారు.

అనంతరం స్పీకర్ వునోహర్, అసెంబ్లీ కార్యదర్శి రాజాసదారాంలు అక్కడినుంచి సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ పార్లమెంటు వూజీ సెక్రటరీ జనరల్ విశ్వనాధన్‌తో సవూవేశవుయ్యూరు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో అనుసరించాల్సిన పద్ధతులపై పార్లమెంటరీ నిబంధనలపై ఆయనతో చర్చించారు. సభలో చర్చ జరిగితేనే అందరి అభిప్రాయాలు ప్రభుత్వానికి, ప్రజలకు తెలుస్తాయని, తద్వారానే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందని విశ్వనాధన్ అభిప్రాయపడ్డారని అసెంబ్లీ కార్యదర్శి రాజసదారాం తెలిపారు.

బీహార్‌లో ఒక్కరోజులో ముగిసిన చర్చ
బీహార్‌నుంచి 18 జిల్లాలతో కూడిన జార్ఖండ్ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తూ 2000 సంవత్సరంలో బీహార్ అసెంబ్లీకి రాష్ట్రపతి బీహార్ పునర్వ్యవస్థీకరణ బిల్లును పంపించారు. ఏప్రిల్ 25న రాష్ట్ర అసెంబ్లీలో ఈ బిల్లుపై చర్చ జరిగింది. అప్పటి ఆ రాష్ట్ర వుుఖ్యవుంత్రి లాలూప్రసాద్ యూదవ్ రాష్ట్ర విభజనను మొదట వ్యతిరేకించినా తరువాత అంగీకారం తెలపడంతో అసెంబ్లీలో చర్చ దాదాపు సాఫీగానే సాగిందని ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు.

బిల్లుపై చర్చ ఒక్కరోజులోనే వుుగిసిందని, మొత్తం 29 వుంది పాల్గొన్నారని చెప్పారు. పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అనేక సవరణలను సభ్యులు ప్రతిపాదించారు. రాతపూర్వక అఫిడవిట్లు ఇవ్వడం వంటివి చోటుచేసుకోలేదు. పైగా సవరణలపై సభ్యులు ఓటింగ్‌కు పట్టుబడితే స్పీకర్ వెంటనే అందుకు సరేనని అవకాశమూ ఇచ్చారు. సవరణల్లో ముఖ్యమైనది బీహార్ ప్రభుత్వమే ప్రవేశపెట్టింది. బీహార్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆయుువుపట్టుగా ఉన్న గనులు, భూగర్భ వనరులు, అడవులతోకూడిన కీలకమైన ప్రాంతం జార్ఖండ్‌లోకి చేరుతున్నందున రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా దిగజారిపోతుందని అధికార రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ సభ్యులు, వుంత్రులు వాదించారు.

రాష్ట్రానికి  ఆర్థిక ఆదాయమిచ్చే ప్రాంతం కోల్పోతున్నందున అందుకు పరిహారంగా బీహార్‌కు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని డివూండ్ చేశారు. రూ.1,79,900 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించాలని కోరుతూ సవరణ ప్రతిపాదించారు. దీంతో పాటు వురో 60 సవరణలను సభ్యులు ప్రతిపాదించారు. వీటిపై ఓటింగ్ కూడా నిర్వహించారు. కేవలం మూజువాణి ఓటింగ్ మాత్రమే జరిగిందని, స్పష్టమైన డివిజన్‌కు ఆస్కారమివ్వలేదని వివరించారు. ఆర్థిక ప్యాకేజీ సవరణకు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపినా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈ సవరణను తిరస్కరించడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు