నాగార్జున అగ్రికెం పరిశ్రమలో ప్రమాదం

12 Feb, 2016 00:05 IST|Sakshi

ఎచ్చెర్ల : అరిణాం అక్కివలస పరిధిలోని నాగార్జున అగ్రికెం పరిశ్రమలో గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఐదుగురు కార్మికులు గాయపడ్డారు. ఉదయం ఏ షిఫ్ట్ నడుస్తున్న సమయంలో 6.30 గంటలకు సల్ఫ్యూరిక్ యూసిడ్ పైపు లీకైంది. దీని నుంచి తుంపర్లు వెలువడి ఆ ప్రాంతంలో పని చేస్తున్న ఐదుగురు కార్మికులు గాయపడ్డారు. వెంటనే పరిశ్రమకు చెందిన అంబులెన్స్‌లో శ్రీకాకుళంలోని సింధూర ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో శాంతారావు, రామకృష్ణ, వెంకటేష్, సంతోష్, వెంకటరావు ఉన్నారు. అరుుతే పరిశ్రమ యూజమాన్యం ఈ సంఘటనను గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసింది.
 
 కార్మికులు క్షేమం...
 ప్రమాదం అనంతరం విషయం బయటకు పొక్కడంతో పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ సి.వరదరాజులు విలేకరులతో మాట్లాడారు. కర్మాగారంలో చిన్న ప్రమాదం చోటు చేసుకుందని, గాయపడ్డ కార్మికులు క్షేమంగా ఉన్నారని చెప్పారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కూడా అయ్యూరని తెలిపారు. పరిశ్రమలో అంగుళం ఉండే యూసిడ్ పైప్ లీక్ వల్ల ఈ సంఘటన చోటు చేసుకుందన్నారు. గాయపడ్డ వారిని సింధూర ఆస్పత్రిలో చేర్చామని ఎటువంటి ఆరోగ్య సమస్య లేదని వైద్యులు ధ్రువీకరించారని చెప్పారు. ఆయన వెంట డీజీఎం కోటేశ్వరరావు ఉన్నారు. ఇదిలా ఉండగా కార్మికులకు ప్రమాదకర గాయూలేమీ కాలేదని అందుకే డిశ్చార్జి చేశామని సింధూర ఆస్పత్రి వైద్యాధికారి పీబీ కామేశ్వరరావు చెప్పారు.   
 
 తరచూ ప్రమాదాలు...
 నాగార్జున అగ్రికెం కెమికల్ పరిశ్రమలో తరచూ ప్రమాదాలు జరుగుతుండటం స్థానికుల్లో ఆందోళన కల్గిస్తుంది. గురువారం యూసిడ్ పైపు లీక్ వల్ల ఐదుగురు గాయపడ్డారన్న అంశం  చర్చనీయాంశంగా మారింది. మ రో పక్క పరిశ్రమలో పెద్ద పేలుడు జరిగిందని ప్రచారం జరిగింది. పరిశ్రమ యాజమాన్యం స్పందించే వరకు ప్రమాద సంఘటనపై స్పష్టత రాలేదు. గతంలో ఓ రెండు పెద్ద ప్రమాదాలు చోటు చేసుకున్న సంఘటనను స్థానికులు గుర్తు చేసుకున్నారు.  2002 జూన్ 30న ఐదో బ్లాక్‌లో రియాక్టర్ పేలుడు చోటు చేసుకొని 18 మంది గాయపడ్డారు. 2014 జనవరి 1న రెండో బ్లాకులో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలయ్యాయి. రియాక్టర్ మూడో ఫ్లోర్  నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌పై పడింది. ప్రస్తుతం పైప్ లీక్ సంఘటనలో కార్మికులు క్షేమంగా బయటపడటంతో పరిశ్రమ యాజమాన్యం, కార్మికుల కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి.
 

మరిన్ని వార్తలు