వాసి వాడి.. తస్సాదియ్యా.. మీ అభిమానం అదిరింది..

22 Dec, 2018 12:09 IST|Sakshi
షాపింగ్‌మాల్‌ను ప్రారంభిస్తున్న హీరో నాగార్జున

త్వరలో గోదావరి గట్టుపై షూటింగ్‌ చేయాలని ఉంది

హీరో అక్కినేని నాగార్జున

లవ్‌ యూ ఆల్‌..’ అన్న యువ హీరో అఖిల్‌

రాజమండ్రికి రాక ఆనందంగా ఉందన్న హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌

సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవంలో తారల హల్‌చల్‌

జిల్లాలో శుక్రవారం సినీ తారల సందడి నెలకొంది. రాజమహేంద్రవరంలో సౌత్‌ ఇండియా...కాకినాడలో సీఎంఆర్‌  షాపింగ్‌ మాల్స్‌ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ నటులను ఆహ్వానించడంతో అభిమానుల ఉత్సాహానికి అంతేలేకుండా పోయింది. ‘వాసి వాడి.. తస్సాదియ్యామీ అభిమానం ‘అదిరింది..’  అంటూ హీరో నాగార్జున‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో డైలాగ్‌ చెబుతూ హుషారెక్కించారు.  ఆయన తన కుమారుడు,హీరో అఖిల్, హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌లతో కలసి అభిమానులకుఆనందాన్ని పంచారు.

రాజమహేంద్రవరం సిటీ: ‘వాసి వాడి.. తస్సాదియ్యా మీ అభిమానం’ అదిరింది..’  అంటూ హీరో నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో డైలాగ్‌ చెబుతూ అభిమానులను ఉర్రూతలూగించారు. ఆయన తన కుమారుడు, హీరో అఖిల్, హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌లతో కలసి సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవంలో సందడి చేశారు. రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్‌ సమీపంలో పాత నాగదేవీ థియేటల్‌ ఆవరణలో నూతనంగా నిర్మించిన సౌత్‌ఇండియా షాపింగ్‌ మాల్‌ను శుక్రవారం నాగార్జున ప్రారంభించారు. అభిమాన తారలను  చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన జనంతో గోకవరం బస్టాండ్‌ సెంటర్‌ కిక్కిరిసిపోయింది.

ఇప్పటికి రాజమండ్రి 25 సార్లు వచ్చా..
నాగార్జున మాట్లాడుతూ సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ 20వ శాఖను ప్రారంభించిందన్నారు. నాణ్యమైన వస్త్రాలు అందించే షాపింగ్‌ మాల్‌ను సద్వినియోగం చేసుకోవాలని అభిమానులకు పిలుపునిచ్చారు.  మాల్‌ యజమాని సురేష్‌ అంటే తనకెంతో ఇష్టమని, ఆ ఇష్టంతోనే ఇక్కడకు వచ్చానన్నారు. రాజమండ్రి ఇప్పటికి 25  సార్లు వచ్చానని, ఈ నగరమంటే చాలా ఇష్టమని చెప్పారు. త్వరలో గోదావరి గట్టున షూటింగ్‌ చేయాలని ఉందన్నారు. అఖిల్, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ మాట్లాడుతూ రాజమండ్రి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ‘లవ్‌యూ ఆల్‌’ అంటూ అఖిల్‌ అభిమానులను ఉత్సాహ పరిచారు.

అందుబాటులో 4 లక్షల వెరైటీలు
షాపింగ్‌మాల్‌ డైరెక్టర్లు సురేష్‌ అభినయ్, రాకే ష్, కేశవ్‌ మాట్లాడుతూ మాల్‌లో అన్ని వర్గాల వారినీ అలరించేందుకు 4 లక్షల వెరైటీలు అందుబాటులో ఉన్నాయన్నారు. 3 రాష్ట్రాల్లో తమ మాల్‌ల సంఖ్య 20కి చేరిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, వైఎస్సార్‌ సీపీ ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు