ఆల్ రౌండర్‌గా సాగర్ జట్టు

15 Dec, 2013 00:18 IST|Sakshi

దౌల్తాబాద్, న్యూస్‌లైన్:  దౌల్తాబాద్ మూడు రోజులుగా జరుగుతున్న ఆరోజోన్ గురుకుల విద్యాలయాల క్రీడలు శనివారం ముగిశాయి. ఈ క్రీడల్లో మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లోని బాలుర గురుకుల పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నాయి. నాగార్జునసాగర్ గురుకుల పాఠశాల విద్యార్థులు అత్యధిక అంశాల్లో ప్రథమ స్థానంలో నిలిచి ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను దక్కించుకున్నారు. అలాగే అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ నాగార్జునసాగర్, దౌల్తాబాద్ జట్లకు సంయుక్తంగా లభించింది. దుబ్బాక ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి చేతులమీదుగా విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. మొదటి, రెండో స్థానాల్లో నిలిచిన జట్లు, క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
 గెలుపొందిన జట్లు..
 వాలీబాల్‌లో నాగార్జునసాగర్ ప్రథమ, చిట్యాల్ ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. ఖోఖోలో చిట్యాల్ ప్రథమ, నాగార్జునసాగర్ ద్వితీయ, కబడ్డీలో నాగార్జునసాగర్ ప్రథమ, దౌల్తాబాద్ ద్వితీయ, షటిల్‌లో కొడంగల్ ప్రథమ, నాగార్జునసాగర్ ద్వి తీయ, టెన్నికైట్‌లో నాగార్జునసాగర్ ప్రథమ, చిట్యాల్ ద్వితీయ స్థానాల్లో నిలిచాయి.
 చెస్‌లో కౌడిపల్లి విద్యార్థి..
 చెస్‌లో కౌడిపల్లికి చెందిన మహేశ్ ప్రథమ, కొడంగల్‌కు చెందిన సందీప్ ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు. వందమీటర్ల పరుగులో మహేశ్(కొడంగల్) ప్రథమ, రవి(దౌల్తాబాద్) ద్వితీ య, 200 మీటర్ల పరుగులో పి.మహేశ్(కొడంగల్) ప్రథమ, బి.మహేశ్(నాగార్జునసాగర్) ద్వితీయ స్థానంలో నిలిచారు. 400 మీటర్ల పరుగులో కృష్ణ(సాగర్) ప్రథమ, భీముడు(చిట్యాల) ద్వితీయ, 800 మీటర్ల పరుగులో బీముడు(చిట్యాల) ప్రథమ, కృపాంజనేయులు(సాగర్) ద్వితీయ, 1,500 మీటర్ల పరుగులో మహేశ్(కొడంగల్) ప్రథమ, రాఘవేందర్(చిట్యాల) ద్వితీయ, షాట్‌పుట్‌లో కృష్ణ(సాగర్) ప్రథమ, అరవింద్(దౌల్తాబాద్) ద్వితీయ, లాంగ్‌జంప్‌లో కె.రంజిత్ (దౌల్తాబాద్) ప్రథమ, మహేశ్(కొడంగల్) ద్వితీయ, హైజంప్‌లో అరవింద్ (దౌల్తాబాద్) ప్రథమ, కృపాంజనేయులు(సాగర్) ద్వితీయ, జావలిన్‌త్రో లో సాగర్‌కు చెందిన పులేందర్ ప్రథ మ, కృష్ణ ద్వితీయ, డిస్కస్‌త్రోలో అరవింద్(దౌల్తాబాద్) ప్రథమ, కృష్ణ(సాగర్) ద్వితీ య స్థానాలను దక్కించుకున్నారు. కార్యక్రమంలో దౌల్తాబాద్, కౌడిపల్లి, కొడంగల్ ప్రిన్సిపాళ్లు  జవహర్, నర్సింహారెడ్డి, జోగిరెడ్డి, దౌల్తాబాద్, లింగరాజ్‌పల్లి సర్పంచ్‌లు ఆదివేణుగోపాల్, సరిత, పీడీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు