ఎంపీ కవితపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం!

5 Aug, 2014 17:58 IST|Sakshi
ఎంపీ కవితపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం!
హైదరాబాద్: టీఆర్ఎస్ నేత, నిజమాబాద్ ఎంపీ కవితపై కేసు నమోదు చేయాలని మాదన్నపేట పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది. స్వాతంత్య్రం వచ్చాక కాశ్మీర్, తెలంగాణను బలవంతంగా భారత్ లో విలీనం చేశారని, కాశ్మీర్‌లోని కొన్ని భాగాలు భారత భూభాగంలోనివి కావని టీఆర్‌ఎస్ ఎంపీ కె.కవిత చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. 
 
దేశ సమగ్రతకు భంగం వాటిల్లే విధంగా టీఆర్ఎస్ ఎంపీ కవిత చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై  బీజేపీ లీగల్‌ సెల్ అడ్వొకేట్‌ కన్వీనర్ కరుణాసాగర్ పిటిషన్ దాఖలు చేశారు. కరుణాసాగర్ ఫిర్యాదును పరిశీలించిన ఏడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ఎంపీ కవితపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు