ఎన్టీఆర్‌పై సినిమా.. నేనే హీరో: బాలయ్య

6 Feb, 2017 14:20 IST|Sakshi
ఎన్టీఆర్‌పై సినిమా.. నేనే హీరో: బాలయ్య

విజయవాడ: చారిత్రక కథాంశంతో గౌతమీపుత్ర శాతకర్ణిని వందో సినిమాగా తీసిన ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి ఎన్టీఆర్ జీవిత చరిత్రపై త్వరలో సినిమా తీస్తానని బాలకృష్ణ ప్రకటించారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో తానే నటిస్తానని బాలకృష్ణ చెప్పారు. ఈ సినిమాకు దర్శకుడు, నిర్మాతలను త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. సోమవారం బాలకృష్ణ తన సొంతూరైన కృష్ణా జిల్లా నిమ్మకూరులో పర్యటించారు. బాలకృష్ణ వెంట ఆయన అల్లుడు నారా లోకేశ్‌ కూడా ఉన్నారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమాపై ప్రకటన చేశారు. ఈ సినిమాలో అన్ని రకాల కోణాలు ఉంటాయన్నారు. తన బంధువులు, ఎన్టీఆర్ సన్నిహితులను కలసి ఆయన చిన్నప్పటి విశేషాలను తెలుసుకుని కథను సిద్ధం చేస్తామని బాలకృష్ణ చెప్పారు.
 

మరిన్ని వార్తలు