నంద్యాల ఉప ఎన్నిక మాయాజాలం

5 Jul, 2017 15:03 IST|Sakshi
నంద్యాల ఉప ఎన్నిక మాయాజాలం
  • నంద్యాల రహదారులకు రూ.114.79 కోట్లు
  • స్వల్పకాలిక టెండర్ల ద్వారా పనులు ప్రారంభించాలి
  • రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు
  • ఎన్నిక ముగిశాక పనులు ఆగిపోతాయంటున్న అధికారులు

  • సాక్షి, అమరావతి: ఎన్నికల సమయంలో లెక్కలేనన్ని హామీలతో ప్రజలను మభ్యపెట్టడం.. అవసరం తీరాక వదిలేయడం. ఇదీ సీఎం చంద్రబాబు నాయుడు ఆచరించే విధానం. తాజాగా నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో అదే విధానాన్ని ఆచరణలో పెడుతున్నా రు. మూడేళ్లుగా నంద్యాల నియోజకవర్గ అభివృద్ధికి పైసా కూడా విడుదల చేయని ప్రభుత్వం ఇప్పుడు రహదారులు, డ్రైనేజీల మరమ్మత్తు పనులకు పరి పాలన అనుమతులు ఇస్తున్నట్లు హడావిడిగా ఉత్తర్వు లు జారీ చేసింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి, అధికార టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి హాఠాన్మరణం చెందడంతో నంద్యాల నియోజక వర్గంలో ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే.

    స్వల్పకాలిక టెండర్ల ద్వారా పనులు
    నంద్యాల నియోజకవర్గంలో మూడేళ్లుగా ఎలాంటి అభివృద్ధి పనులు మంజూరు చేయని చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు 114.79 కోట్ల విలువైన రహదారుల, డ్రైనేజీ తదితర పనులకు పరిపాలన అనుమతులు ఇచ్చేసింది. ఈ మేరకు రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ ముఖ్యకార్యదర్శి సుమితా దావ్రా మంగళవారం రెండు జీవోలు జారీ చేశారు. ఒక జీవోలో రూ.93.85 కోట్లతో రెండు ప్యాకేజీల రహదారుల పనులకు పరిపాలన అనుమతులను ఇచ్చారు. ఈ పనులను స్వల్పకాలిక టెండర్ల ద్వారా వెంటనే ప్రారంభించాలని ఆదేశిం చారు.

    అలాగే, మరో జీవోలో రూ.20.94 కోట్లతో ఎనిమిది రహదారుల పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. ఈ పనులను కూడా స్వల్పకాలిక టెండర్ల ద్వారా ప్రారంభించాలని జీవోలో పేర్కొన్నారు. స్వల్పకాలిక టెండర్ల ద్వారా అంటే పనులు ప్రారంభమయ్యాయని ప్రజలను మభ్య పెట్టడానికేనని, ఎన్నికల తర్వాత అవి ఎక్కడికక్కడ నిలిచిపోతాయని అధికారులే వ్యాఖ్యా నిస్తున్నారు. త్వరలో జరగబోయే ఉప ఎన్నికలో ఓటర్లను మభ్యపెట్టేందుకు అధికార పార్టీ ఎత్తులు వేస్తోందని చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు