‘సినిమాల్లో మితిమీరుతున్న అశ్లీలం’

20 Jul, 2018 20:06 IST|Sakshi
నన్నపనేని రాజకుమారి (ఫైల్‌ ఫోటో)

ఏలూరులో నన్నపనేని రాజకుమారి మీడియా సమావేశం

సాక్షి, అమరావతి : సినిమాల్లో అశ్లీల సన్నివేశాలు మితిమీరుతున్నాయని ఏపీ మహిళ కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమార్‌ అన్నారు. పశ్చిమ గోదావరిలోని ఏలూరులో శుక్రవారం ఆమె మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజా కుమారి మాట్లాడుతూ.. టీవీ సీరియల్స్‌లో మహిళలను చాలా దారుణమైన క్యారెక్టర్లుగా చూపిస్తున్నారని  పేర్కొన్నారు. టీవీ సీరియల్స్‌ నుంచి అశ్లీల సన్నివేశాలను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు.

ప్రజలు ప్రతి విషయంలో సామాజిక బాధ్యత వహించాలని, శాంతి భద్రతల కొరకు పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రజలందరూ చట్టాలపై అవగహన పెంచుకోవాలని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని, ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి పార్లమెంట్‌లో ఎంపీ గల్లా జయదేవ్‌ అద్భుతంగా మాట్లాడారని కొనియాడారు. గల్ఫ్‌ దేశాలకు వలసలు వెళ్లే మహిళలకు అవగాహన కల్పించి స్థానికంగా ఉపాధి పొందేలా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా: అపార్ట్‌మెంట్లలో​ లాక్‌డౌన్‌

క్వారంటైన్‌ కేంద్రాల నుంచి విముక్తి 

కర్నూలులో కరోనా విజృంభన

కృష్ణా జిల్లాలో కరోనా బుసలు!

ఆర్టీసీ ‘కరోనా’ సేవలు.. రోజుకు రూ.3.5 కోట్ల నష్టం

సినిమా

‘ఆచార్య’లో మహేశ్‌.. చిరు స్పందన

తారా దీపం

ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు

పేద సినీ కార్మికులకు సహాయం

మహేష్‌ మేనల్లుడు అశోక్‌ లుక్‌ రివీల్‌..

బన్నీ బర్త్‌ డే.. ముందే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన దేవీశ్రీ