‘అయేషా దోషులకు శిక్ష పడేవరకు పోరాటం’

6 Aug, 2017 14:29 IST|Sakshi
‘అయేషా దోషులకు శిక్ష పడేవరకు పోరాటం’
విజయవాడ: అయేషా మీరా కేసును రీ ఓపెన్ చేయడం ఊరట కలిగించింది. ఈ కేసులో అసలైన దోషులను పట్టుకోవడానికి ఇది మంచి అవకాశమని మహిళ కమిషన్ చైర్మెన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. ఆమె ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ కేసు విషయంలో ఆయేషా తల్లిదండ్రులకు ప్రభుత్వం, మహిళా కమిషన్ సపోర్టుగా ఉంటుంది. అసలైన దోషులకు శిక్ష పడేవరకు పోరాటం చేస్తామన్నారు. ఆనాడు పోలీసులు అసలు నిందితులను తప్పించి అమాయకుడైనా సత్యంబాబు జీవితాన్ని నాశనం చేశారని ఆమె అన్నారు. 
 
ఈ కేసులో విషయంలో సీపీ గౌతమ్ సవాంగ్ మొదట నుంచి వివాదాస్పదంగా మాట్లాడుతున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా అలా మాట్లాడటం తగదని ఆమె తెలిపారు. ఈ కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్కు కమిషనర్ గౌతమ్ సవాంగ్ పర్యవేక్షన వద్దని ఎవరైనా మంచి మహిళ అధికారిని నియమించాలన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి  తీసుకెళ్లామన్నారు. ఈ హత్యకేసు దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. ఆయేషా హత్య కేసులో నిందితుడు సత్యంబాబును ఇటీవల హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అంతేకా అతడికి లక్ష రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని తెలిపింది.
 
కేసులో తగిన ఆధారాలు లేకుండా సత్యం బాబాను ఎనిమిదేళ్ల పాటు జైలు జీవితం అనుభవించాడు. పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం కూడా సత్యం బాబు నిర్దోషి అని, అసలు నిందితులైన కోనేరు రంగారావు బంధువులను వదిలిపెట్టి ఇతడిని ఇరికించారని అప్పట్లోనే తెలిపింది. ఈ విషయంపై సత్యం బాబు విడుదలైనా తరువాత సంచలన వ్యాఖ్యలు చేశాడు. అప్పటి పరిస్థితుల్లో గత్యంతరం లేక నేరాన్ని అంగీకరించినట్టు చెప్పాడు.
 
మరిన్ని వార్తలు