‘లోకేశ్‌ అవినీతికి కోర్టు అడ్డుకట్ట’

9 Jul, 2017 14:08 IST|Sakshi
‘లోకేశ్‌ అవినీతికి కోర్టు అడ్డుకట్ట’

రాష్ట్రంలో 3లక్షల 75వేల కోట్లకుపైగా అవినీతి
రాజధానిలో లక్షన్నర కోట్ల అవినీతి
న్యాయస్థానాలంటే చంద్రబాబుకు గౌరవం లేదు
పేదవాడంటే లెక్కలేదు..రైతులంటే కనీస జాలీలేదు
చంద్రబాబు భూదోపిడీని అడ్డుకుందాం
వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం పనిచేస్తున్న జగనన్నకు అండగా నిలుద్దాం
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే


అమరావతిః పేదలపెన్నిధిగా వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిస్తే... అమలుకాని హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు మూడేళ్లలో 3 లక్షల 75వేల కోట్లకు పైగా అవినీతికి పాల్పడిన ఘనుడుగా చరిత్రలో నిలిచారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. అందులో లక్షన్నర కోట్ల వరకు రాజధాని ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సంపాదించడంటే అంతకన్నా దారుణం మరొకటి ఉడదని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ సీపీ ప్లీనరీలో రాజధాని భూములు, నిర్మాణాలు, లక్ష కోట్ల అవినీతికి సంబంధంచి ఆర్కే మాట్లాడారు. ఈ సందర్భంగా ఏమన్నారంటే....

‘చంద్రబాబు రైతు వ్యతిరేకి. అవసరం లేని పక్క రాష్ట్రంలో ఓటుకు నోటు కేసులో అడ్డగొలుగా ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయిన బాబు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ రాత్రికి రాత్రే పారిపోయి వచ్చాడు. చెప్పిన హామీలు అమలు చేస్తాడని ఎదురుచూసిన ప్రజానీకానికి రాజధాని ముసుగులో బాబు చేస్తున్న దోపిడీ పూర్తిగా అర్థమైపోయింది. రాజధానికి బాబు లక్షా 6వేల ఎకరాలు నిర్ణయించారంటే అది భూదోపిడీ కోసమేనని వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట ఈరోజున రుజువైంది. రాజధానికి మేం వ్యతిరేకం కాదు. రాజధాని ముసుగులో బాబు చేస్తున్న భూదోపిడీకి మాత్రమే వైఎస్సార్సీపీ వ్యతిరేకం. శివరామకృష్ణన్ కమిటీ, రాజకీయ పార్టీలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా నారాయణ కమిటీ వేసి తన మంత్రులు, మ్మెల్యేలు, ఎంపీల కోసం రాజధానిని వాడాడు. రైతులు, రైతు కూలీలకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. ఆయన తీసుకున్న లక్షా 6వేల ఎకరాల్లో కేవలం 20ఎకరాల్లో మాత్రమే తాత్కాలిక భవనాలు నిర్మించాడు తప్ప ఇంకోటి లేదు. దాంట్లో కూడా తాత్కాలిక భవనాన్ని అడ్డంపెట్టుకొని వేయి కోట్లు దోచుకున్నాడు.

రైతులు 33వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారని చెబుతున్నారు. భూములివ్వని, ఇచ్చిన రైతులను కూడా బాబు మోసం చేస్తానే ఉన్నాడు. కేవలం 500 నుంచి 600 ఎకరాలు మాత్రమే ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేశాడు. స్విస్ చాలెంజ్ విధానం దేశానికి సరికాదని కేల్కర్ కమిటీ, గౌరవ న్యాయస్థానాలు చెప్పినా వినడం లేదు. చంద్రబాబుకు న్యాయస్థానాలంటే గౌరవం లేదు. పేదవాడంటే లెక్కలేదు. రైతంటే కనీస జాలి కూడా లేదు. బాబు భూదోపిడీకి అడ్డుకట్ట వేద్దాం. రాజధానిని చంద్రబాబు తన భూదోపిడీకి, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుకుంటున్నాడు తప్ప రైతులు, కూలీలకు కూడ మేలు చేయని పరిస్థితి. గతంలో వైఎస్ఆర్ రైతులకు భూములిచ్చిన సంగతి మనమందరికీ తెలుసు. నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములకు ప్యాకేజీలు కూడా ఇవ్వడం లేదు. భూములివ్వని వారిని భయపెట్టి కేసులు పెడుతున్నారు. బాబుకు రోజులు దగ్గరపడ్డాయి.

బాబు అవినీతికి నేనేమాత్రం తీసిపోనని ఆయన కొడుకు లోకేశ్‌ కూడా అదే దారిలో వెళ్తున్నాడు. దేవాదాయ భూములను వదిలిపెట్టకూడదని చెప్పి సదావర్తి సత్రంలో లోకేశ్‌ 83 ఎకరాలను కాజేస్తే న్యాయస్థానం అడ్డుకట్ట వేసింది. రైతులను రాజును చేయాలి, పేదవాడిని గొప్పవాడిని చేయాలన్న వైఎస్ఆర్ ఆశయం కోసం పనిచేస్తున్న రాజన్న తనయుడు వైఎస్ జగన్ అడుగులో అడుగేద్దాం. రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందాం. జగనన్న అడుగులో అడుగేయాలని రాజన్నవారసులు.. జగనన్న సైనికులను కోరుతున్నాన’ని ముగించారు.
 

చదవండి:

నాయకుడంటే ప్రజల గుండె చప్పుడు: వైఎస్‌ విజయమ్మ

మాట తప్పడం మా రక్తంలో లేదు: వైఎస్‌ షర్మిల

'వచ్చే ఎన్నికల్లో బాబుకు ఒకటి, పప్పుకొకటి'


ప్రశాంత్‌ కిషోర్‌ను పరిచయం చేసిన వైఎస్‌ జగన్‌

ఎన్టీఆర్‌తోనే చంద్రబాబు హత్యా రాజకీయాలు