మీరు సీఎం కావాలన్నా

17 Dec, 2018 07:26 IST|Sakshi

శ్రీకాకుళం :‘అన్నా.. జనం ఎదుర్కొంటున్న కష్టాలు, కన్నీళ్లు తీర్చేంచేందుకు మీరు సీఎం కావాలి’ అని నరసన్నపేటకు చెందిన వి.లక్ష్మి, వి.తేజ ఆకాంక్షించారు. వారు జగన్‌ను కలిసి మాట్లాడుతూ మీపై దాడి జరిగినప్పుడు కలత చెందామని చెప్పారు. మీరు ఆరోగ్యంగా ఉండాలని, సీఎం కావాలని కోరారు.  

మైనార్టీల అభివృద్ధికి కృషి చేయాలి
‘సార్‌ మైనార్టీల అభివృద్ధికి కృషి చేయాలి. ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు’ అని అనంతపురానికి చెందిన ముస్లింల సంఘ నాయకుడు డాక్టర్‌ మైనుద్దీన్‌ జగన్‌కు తెలిపారు. మక్కా యాత్రకు గతంలో రాయితీ అందజేసేవా రని, మీరు అధికారంలోకి రాగానే ఉచితంగా రవాణా సదుపాయం కల్పించాలని కోరారు.

మరిన్ని వార్తలు