సొంతూరులో చంద్రబాబుకు ఇది నిజంగా చెంపదెబ్బే

12 Feb, 2020 19:02 IST|Sakshi

సాక్షి, చంద్రగిరి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం అమలుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయానికి నారావారిపల్లి గ్రామ ప్రజలు జై కొట్టారు. చంద్రబాబు సొంతూరు అయిన నారావారిపల్లెలోనూ ఇంగ్లీషు మీడియం విద్యకు గ్రామస్తులు ఆమోదం తెలిపారు. వచ్చే ఏడాది నుంచి తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం విద్యను ప్రవేశపెట్టాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన నారావారిపల్లెకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు సుముఖత వ్యక్తం చేశారు. 

కాగా  రాష్ట్రవ్యాప్తంగా 43 వేల ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీషు మీడియం విద్యను ప్రవేశపెట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి.. ఇప్పటికే ప్రభుత్వానికి పంపారు.  దీంతో  పేద ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దే..  ఇంగ్లీషు మీడియం విద్యకు ఇంతకాలం మోకాలడ్డుతున్న కొంతమంది కుహనా మేధావులకు, తల్లిభాష పేరుతో దుష్ట రాజకీయం చేస్తున్న ప్రతిపక్ష పార్టీలకు, పేదవర్గాలకు పెద్ద చదువులు అందకూడదని కుట్రలు పన్నుతున్న ఎల్లో మీడియా శక్తులకు నారావారిపల్లె నుంచే ప్రజలు బుద్ధి చెప్పినట్లు అయింది. సొంతూరులో చంద్రబాబుకు ఇది నిజంగా చెంపదెబ్బే.

రాష్ట్రంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సర్కారు బడుల రూపురేఖలను సమూలంగా మార్చే కార్యక్రమానికి నడుం బిగించారు. ప్రభుత్వ విద్యా విధానంలో మెరుగైన ఫలితాలను తీసుకువచ్చేందుకు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కార్పోరేట్‌ స్కూళ్లలో భారీగా ఫీజులు చెల్లించగలిగే వారికే పరిమితమైన ఇంగ్లీష్‌ మీడియం చదువులను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు కూడా చేరువ చేయాలనే సంకల్పాన్ని సాకారంలోకి తెచ్చారు.  చదవండి: బాబును ఎవరూ నమ్మొద్దు.. అన్నీ దొంగ సర్వేలే


ఈ నిర్ణయాలన్నింటి పైనా నారావారిపల్లి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు చర్చించి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సమావేశంలో 15 మంది విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనాల్సి ఉండగా.. 12 మంది విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై ఏకగ్రీవంగా వారి నిర్ణయాన్ని వెల్లడించారు. అందుకు అనుగుణంగానే 1 నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం భోదించేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీంతో పేద ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దే ఇంగ్లీష్‌ మీడియం విద్యకు ఇంతకాలం మోకాలడ్డుతున్న కొంతమంది కుహానా మేధావులకు, తల్లిభాష పేరుతో దుష్ట​ రాజకీయం చేస్తున్న ప్రతిపక్ష పార్టీలకు, ఎల్లో మీడియా శక్తులకు నారావారిపల్లి ప్రజలు బుద్ధి చెప్పినట్లయ్యింది. 

మరిన్ని వార్తలు