తిరుపతిలో నారాయణ కాలేజీ దౌర్జన్యం!

19 Aug, 2019 16:15 IST|Sakshi

సాక్షి, తిరుపతి: నారాయణ కళాశాల సిబ్బంది దౌర్జన్యం మరోసారి బయటపడింది. కేవలం ఒక్క రోజు ఫీజు చెల్లించడంలో ఆలస్యం జరగడంతో ఇంటర్‌ సెంకడియర్‌ విద్యార్థిని నారాయణ కాలేజీ సిబ్బంది గెంటేశారు. ఫీజు కట్టడానికి వచ్చిన విద్యార్థి తండ్రిపైన దౌర్జన్యానికి దిగారు. తిరుపతి నారాయణ కాలేజీలో ఈ ఘటన జరిగింది. తిరుపతికి చెందిన గోవిందరెడ్డి కుమారుడు నితిన్ నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈ ఏడాదికి సంబంధించిన ఫీజు కట్టడంలో అతనికి కొంత ఆలస్యం జరిగింది. దీంతో గత శనివారం నితిన్‌ను కళాశాల సిబ్బంది అమానుషంగా కాలేజీ నుంచి గెంటి వేశారు. ఈ నేపథ్యంలో నితిన్‌ తండ్రి గోవిందరెడ్డి ఫీజు కట్టడానికి సోమవారం కళాశాలకు వెళ్లాడు. ఒక్క రోజు ఆలస్యం అయినందుకే మా అబ్బాయిని కాలేజి నుంచి గెంటేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. దీంతో నారాయణ కాలేజీ సిబ్బంది ఆయనపై దాడికి దిగినట్టు తెలుస్తోంది. నారాయణ కాలేజీ సిబ్బంది దౌర్జన్యపూరితంగా ప్రవర్తించారని, విద్యార్థిని గెంటేయడమే కాకుండా ఇదేం పద్ధతి అని ప్రశ్నించిన తమపై దాడికి పూనుకున్నారని బాధితులు గోవిందరెడ్డి, ఆయన కుమారుడు ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు