మద్యం ముడుపులు తీసుకున్నది చంద్రబాబే

6 May, 2020 14:34 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో దశల వారీగా మద్యపాన నిషేధం చేసి తీరుతామని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. ఆయన బుధవారం సచివాలయంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మద్యపాన నిషేధానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని గుర్తు చేశారు. అందుకే షాక్ కొట్టేలా మద్యం ధరలు పెంచామని ఆయన తెలిపారు. చంద్రబాబుకి సీఎం జగన్‌ని విమర్శించే అర్హత లేదని, ఎన్టీఆర్ తెచ్చిన మద్యపాన నిషేధాన్ని బాబు ఎత్తేశాడని నారాయణ స్వామి మండిపడ్డారు. ('త్యాగాలు మీవి.. భోగాలు వారివి')

బాబు గత ఐదేళ్లలో 43వేల బెల్టు షాపులతో మద్యాన్ని గ్రామాల్లో పారించాడని నారాయణ స్వామి దుయ్యబట్టారు. తాము 20 శాతం షాపులు, 43 వేల బెల్టు షాపులు తొలగించామని ఆయన గుర్తుచేశారు. టీడీపీ నేతలు నాటుసారా, నకిలీ మద్యం వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మనుషులే బార్లలో అక్రమ మద్యం వ్యాపారం చేశారని నారాయణ స్వామి తెలిపారు. వందల కోట్లు మద్యం ముడుపులు తీసుకున్నది చంద్రబాబే అని అన్నారు. ధరలు పెంచితే చంద్రబాబు ఎందుకు గగ్గోలు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. మహిళల కోసం సీఎం వైఎస్‌ జగన్ దశల వారీ మద్యపాన నిషేధం అమలు చేస్తున్నారని నారాయణ స్వామి తెలిపారు.

మరిన్ని వార్తలు