తులసి రామచంద్రప్రభుకు ‘నాట్స్’ పురస్కారం

9 Jul, 2013 16:23 IST|Sakshi

ప్రముఖ పారిశ్రామికవేత్త, తులసి సీడ్స్ అధినేత తులసి రామచంద్రప్రభు సేవలకు గుర్తింపుగా నార్త్ అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) అవార్డుతో సత్కరించింది. అమెరికాలోని డల్లాస్‌లో గత మూడురోజులుగా జరిగిన నాట్స్ సంబరాల్లో భాగంగా ఆయనకు ‘ కమ్యూనిటీ సర్వీస్ అండ్ ఎంటర్ ప్రినర్‌షిప్’ అవార్డును అందజేసింది. ఈ సందర్భంగా వేలాది మంది విద్యార్థులకు ఉపకారవేతనాలు అందిస్తున్న దాతగా రామచంద్రప్రభుని అమెరికాలోని తెలుగుసొసైటీ కొనియాడింది.

>
మరిన్ని వార్తలు