పార్టీలకు అతీతంగా నవరత్నాలు అమలు : బుగ్గన

27 Jul, 2019 12:21 IST|Sakshi

సాక్షి, కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాలను పార్టీలకు అతీతంగా అమలు చేస్తామని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వం ముందున్న ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. శనివారం కర్నూల్‌లో జిల్లాలో పర్యటించిన ఆయన.. మీడియా సమావేశంలో మాట్లాడారు. డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మహిళలను పెద్ద ఎత్తున మోసం చేశారని విమర్శించారు. రుణాలు మాఫీ చేయకుండా అన్ని వర్గాల ప్రజలను దారుణంగా మోసిం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని బుగ్గన మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో త్వరలోనే మహిళలకు వడ్డీలేని రుణాలను అందిస్తామని మంత్రి తెలిపారు.

మరిన్ని వార్తలు