నవయుగకే పోలవరం కాంట్రాక్ట్‌ పనులు

30 Jan, 2018 18:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: పోలవరం ప్రాజెక్ట్‌ కాంట్రాక్ట్‌లో భారీ ట్విస్ట్‌ చేసుకుంది. పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్‌ పనులను నవయుగ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీకి అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ పనులను ఈ సంస్థ చేపట్టనుంది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కార్యాలయంలో మంగళవారం పోలవరంపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రాజెక్టులో స్పిల్‌వే కాంక్రీటు, స్పిల్‌ ఛానల్‌ పనులను కొత్త గుత్తేదారుకు అప్పగించే అంశంపై స్పష్టత వచ్చింది.

కాంట్రాక్టర్‌ మార్పు అంశాలపై చర్చించిన అనంతరం పాత ధరకే పనులు చేపట్టేందుకు నవయుగ సంస్థ ముందుకు రావడంతో కేంద్రం...కాంట్రాక్ట్‌ పనులను ఆ సంస్థకు అప్పగించేందుకు ఆమోదం తెలిపింది. పాత ధరల ప్రకారం రూ.1196 కోట్లకు నవయుగ సంస్థ పనులు చేపట్టనుంది. గతంలో ఏపీ సర్కార్‌ రూ.1483 కోట్లకు అంచనాలు పెంచి టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆ టెండర్లకు పీపీఏ సమావేశంలో కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్రం అభ్యంతరంతో పాత ధరకే నవయుగ కొత్త కాంట్రాక్ట్‌ను చేపడుతోంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు