ఆకట్టుకున్న నేవీ సిబ్బంది విన్యాసాలు

30 Nov, 2013 01:12 IST|Sakshi

విశాఖపట్నం, న్యూస్‌లైన్: డొర్నియర్లు రొద చేసుకుంటూ గగనంలో దూసుకుపోతుంటే... సముద్రంలోని యుద్ధనౌకల నుంచి హఠాత్తుగా బాంబుల మోత మోగితే... ఆకాశం నుంచి గ్లైడర్లు భూమిపైకి దూసుకువస్తుంటే... ఏదో ఉపద్రవం ముంచికొచ్చినట్లే.  అయితే ఈ యుద్ధ సన్నివే శాలు శుక్రవారం సాగరతీరంలో చోటుచేసుకున్నాయి. ఇవన్నీ నేవీ డే వేడుకల్లో భాగంగా పూర్తిస్థాయిలో జరిగిన రిహార్సల్స్.

డిసెంబర్ 4న నేవీ డే వేడుకల్లో భాగంగా యుద్ధ సన్నివేశాల్ని తూర్పు నావికా దళం సాగరతీరంలో ఓసారి నిర్వహించి సరిచూసుకుంది. సముద్రంలోనే బంకర్లును ఏర్పాటు చేసింది. వాటిని సముద్రంలో ప్రయాణిస్తున్న యుద్ధనౌకల నుంచే పేల్చేయడం...హఠాత్తుగా యుద్ధ విమానం నుంచి నావికుడు కిందకి దిగి సముద్రంలో కొట్టుకుపోతున్న వారిని రక్షించడం...ఆకాశంలోంచి త్రివర్ణాలతో స్క్రైడైవర్ భూమ్మీదకు దిగడం వంటి విన్యాసాలు సాగర తీరానికి విహారానికి వచ్చిన వారిని అబ్బురపరిచాయి.  
 

మరిన్ని వార్తలు