సరిలేరు.. మీకెవ్వరు.! 

30 Nov, 2019 08:51 IST|Sakshi

నేవీ రిహార్సల్స్‌.. సూపర్‌ హిట్‌ 

నేవీ డే ఉత్సవాలను పురస్కరించుకుని తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఆర్కే బీచ్‌లో చేపట్టిన రిహార్సల్స్‌ అబ్బుర పరిచాయి. జెమినీ బోట్లలో దూసుకొచ్చిన నౌకాదళం  విన్యాసాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.  

సాక్షి, విశాఖపట్నం: సముద్రాన్ని చీల్చుకుంటూ సాగిపోతున్న హైస్పీడ్‌ బోట్లు.. వినీలాకాశంలో చక్కర్లు కొడుతూ భువి నుంచి సాగర జలాల్లోకి త్రివర్ణ పతాకంతో దిగివచ్చిన స్కై డైవర్లు.. శత్రు స్థావరాలపై మెరైన్‌ కమాండోల ఆకస్మిక దాడులు.. రివ్వున దూసుకొచ్చి.. శత్రు నౌకలపై దాడి చేసి మెరుపు వేగంతో వెళ్లిపోయిన సీ కింగ్‌ హెలికాఫ్టర్లు.. ఇలా.. ఒకటి కాదు రెండు కాదు.. కళ్లు చెదిరే విన్యాసాలతో కదన రంగాన్ని తలపించే వాతావరణంతో ఆర్‌కే బీచ్‌ వేడెక్కింది. నేవీ డే ఉత్సవాలు పురస్కరించుకుని తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఆర్‌కె బీచ్‌లో చేపట్టిన మొదటి ప్రధాన రిహార్సల్స్‌ అబ్బుర పరిచాయి.

జెమినీ బోట్లలో దూసుకొచ్చిన నౌకాదళం విన్యాసాలు బీచ్‌ సందర్శకులను ఆకట్టుకున్నాయి. డిసెంబర్‌ 4న నేవీ డే సందర్భంగా సాగర జలాల్లో నేవీ సిబ్బంది ఏటా విన్యాసాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా వారం రోజుల ముందు నుంచే రిహార్సల్స్‌ చేస్తుంటారు. తొలి రోజు రిహార్సల్‌ అదరహో అనిపించాయి. డిసెంబర్‌ 2వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకూ భారీ రిహార్సల్స్‌ నిర్వహించనున్నట్లు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. ఆర్‌కె బీచ్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన నేవీ తాత్కాలిక కంట్రోల్‌ రూమ్‌ నుంచి అధికారులు విన్యాసాలను పర్యవేక్షించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వీడు ‘గోల్డ్‌’ ఎహే...

సువర్ణ పాలన 

సమస్యల పరిష్కారమే లక్ష్యం

అమృత్‌ పథకానికి అదనపు నిధులివ్వలేం: కేంద్రం

సంక్షేమంలో సూపర్‌ సిక్సర్‌

ఇప్పటివరకు 129.. ఇక 68

గంజాయి తోటల్లో ఉద్యాన వన సిరులు

అనంతపురం కలెక్టర్‌గా గంధం చంద్రుడు 

రాష్ట్రాలకు ఆర్థిక అధికారాలు ఎక్కువగా ఉండాలి

టిడ్కో మిగతా ఇళ్లకు డిసెంబర్‌లో రివర్స్‌ టెండర్లు

అప్పుడు దోచుకుని ఇప్పుడు డ్రామాలా!?

డిశ్చార్జి తర్వాత రోజుకు రూ.225

ఆడపడుచులకు ఆపదలో అస్త్రాలివే

నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో డ్రోన్‌ ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌

‘స్థానిక’ సందడి!

అక్రమ వ్యాపారం.. కృత్రిమ కొరత

487 బార్లకు నోటిఫికేషన్‌

6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా..

రోడ్డు ప్రమాదంలో అచ్చెన్నాయుడికి గాయాలు

సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు

నైపుణ్య శిక్షణలో ఏపీ టాప్‌..

ఈనాటి ముఖ్యాంశాలు

'అవినీతికి పాల్పడే అధికారులను విడిచిపెట్టం'

వైఎస్సార్‌సీపీలో చేరిన కారెం శివాజీ

బార్‌ లైసెన్స్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ

నవరత్నాల్లో ముఖ్యమైనది ఇది: మంత్రి

ఏపీలో యూరియా కొరత లేదు : సదానంద గౌడ

ఏపీలో 8మంది అడిషనల్‌ ఎస్పీలకు పదోన్నతులు

అమరావతిలో భారీ మోసం​

నరేగా బకాయిలు విడుదల చేయండి : విజయసాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘షరతు ప్రకారం మగవారితో మాట్లాడలేదు’

మా అమ్మకు అటిట్యూట్‌ ప్రాబ్లం.. అందుకే..

పాటల సందడి

ప్రతి సీన్‌లో నవ్వు

బిజీ తాప్సీ

పరిశోధకుడు