నక్సలైట్లు మనకు మిత్రులే: బలరాం నాయక్

25 Jul, 2013 14:13 IST|Sakshi
నక్సలైట్లు మనకు మిత్రులే: బలరాం నాయక్

వరంగల్‌: నక్సలైట్లు మనకు మంచి మిత్రులేనని కేంద్ర మంత్రి బలరాం నాయక్ వ్యాఖ్యానించారు. దేశంలో అసలు నక్సలైట్లు లేని రాష్ట్రం ఏదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే నక్సలైట్ల సమస్య తలెత్తుతుందన్న వాదనను ఆయన ఖండించారు.

కాంగ్రెస్ కోర్ కమిటీలోని సభ్యులంతా రాష్ట్ర విభజనవైపే మొగ్గు చూపారని బలరాం నాయక్ చెప్పారు. అయినా సీమాంధ్ర నేతలు మాత్రం ఇంకా నక్సలైట్ల సాకు చూపుతున్నారని మండిపడ్డారు. వారి రాజీనామాల విషయాన్ని కాంగ్రెస్ అధిష్ఠానమే చూసుకుంటుందని తెలిపారు.

తెలంగాణ వస్తే నక్సల్స్ సమస్య పెరుగుతుందని ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి రోడ్ మ్యాప్ సందర్బంగా కోర్ కమిటీ సమావేశంలో పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా సీఎం వైఖరిపై తెలంగాణ ప్రాంత నేతలు పెద్ద ఎత్తున మండిపడ్డారు కూడా. నక్సల్స్ ఎక్కడ ఉన్నారో చూపాలంటూ సీఎంకు సవాల్ కూడా విసిరారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు