సబ్‌జైలుకు ఎన్‌సీఎస్ డెరైక్టర్లు

8 Sep, 2014 01:42 IST|Sakshi
సబ్‌జైలుకు ఎన్‌సీఎస్ డెరైక్టర్లు

 ఎన్‌సీఎస్ సుగర్స్ కర్మాగారం కథ కీలక మలుపు తిరిగింది. చెరుకు బిల్లుల బకారుులు చెల్లించాలని కొన్నాళ్లుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులు గడిచిన వారంలో ఉద్యమాన్ని వేడెక్కించారు. ఫలితంగా పోలీసుల లాఠీచార్జిలో రైతులు గాయపడడం, రైతు సంఘాల నేతల అరెస్ట్‌లు, రహదారుల దిగ్బంధంతో ఒక్కసారిగా ఉద్యమ స్వరూపం మారిపోయింది. ఈ క్రమంలో సుగర్స్ యూజమాన్యం భూములను స్వాధీనం చేసుకుని బిల్లులు చెల్లిస్తామని కలెక్టర్ స్వయంగా ప్రకటించి ఆందోళనకు దూరంగా ఉండాలని రైతులను కోరినా... రైతులు తమ పంథా వీడలేదు. ఈ క్రమంలో సుగర్స్ డెరైక్టర్లు ఇద్దరిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు బొబ్బిలి సబ్‌జైలుకు తరలించారు. అయినా తమ బిల్లులు చెల్లించే వరకు విశ్రమించేది లేదని రైతులు చెబుతున్నారు. అదే సమయంలో ఆదివా రం సమావేశమైన రైతు సంఘం నాయకులు మంగళవారం సుగర్స్ పరిధిలోని తహశీల్దార్ కార్యాలయూల ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
 
 బొబ్బిలి : లచ్చయ్యపేటలోని ఎన్‌సీఎస్ సుగర్స్ కర్మాగారం చెరుకు రైతులకు రూ.24 కోట్ల బిల్లులు చెల్లించని కేసులో అరెస్ట్ అరుున కర్మాగార డెరైక్టర్లు నారాయణం మురళి, నారాయ ణం శ్రీనివాస్‌లకు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ వరలక్ష్మి ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ విధించారు. దీంతో వీరిద్దరిని బొబ్బిలి సబ్‌జైలుకు పోలీసులు తరలించారు. ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో వారిని మెజిస్ట్రేట్ ఇంటి వద్ద హాజరుపరిచారు. శనివారం అదుపులోకి తీసుకున్న డెరైక్టర్లను జిల్లా కేంద్రంలో ఎస్‌పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ ఆదివారం మీడియూ ముందు జిల్లా  కేం ద్రం విజయనగరంలో ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి బొబ్బిలి మెజిస్ట్రేట్ ఇంటి వద్దకు తరువాత సబ్‌జైలుకు తరలించే సమయంలో బొబ్బిలి డీఎస్‌పీ ఇషాక్ మహ్మద్ ఆధ్వర్యంలో సీఐ తిరుమలరావు బందోబస్తు ఏర్పాటు చేశా రు.
 
 ఇదిలా ఉండగా డెరైక్టర్లు ఇద్దరిపై పార్వతీ పురం సబ్ కలెక్టర్ శ్వేతా మహంతి పోలీసుల కు ఇచ్చిన ఫిర్యాదుతో పాటు బిల్లులు సకాలంలో చెల్లించలేదని, పూర్తిగా బిల్లులు ఇవ్వలేదని ఇద్దరు రైతులు పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో వీరిపై మూడు కేసులను నమోదు చేశారు. మోసం చేసినందుకు 420 సెక్షన్‌ను, స్థిరాస్తులను దుర్వినియో గం చేసినందుకు 403 సెక్షన్‌ను, విశ్వాస ఘాతకానికి పాల్పడినందుకు 406 సెక్షన్‌ను, వ్యాపారిగా నమ్మించి మోసం చేసినందుకు 409 సెక్షన్‌ను, ఆర్థిక నేరాలకు కుట్ర పూర్వకంగా పాల్పడినందుకు 120 బి సెక్షన్‌ను నమోదు చేశారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చిన సమయంలో డెరైక్టర్లకు బెరుుల్ ఇవ్వాలని వారి తరఫున న్యాయవాదులు చేసిన దరఖాస్తును తిరస్కరించారు. సుగర్స్‌కు సంబంధించిన వ్యవహారంలో విచారించేందుకు డెరైక్టర్లను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టుకు అభ్యర్థించినట్టు తెలిసింది.
 
 ఇదిలా ఉంటే డెరైక్టర్ల తండ్రి, మేనేజింగ్ డెరైక్టర్ అయిన నారాయణం నాగేశ్వరరావును ఇప్పటికే జాతీయ స్థాయిలో జరిగిన ఓ  కుంభకోణం కేసులో ముంబాయి పోలీసులు అరెస్ట్ చేసినట్టు ఎస్‌పీ గ్రేవల్ విజయనగరంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. త్వరలోనే ఇక్కడకు రప్పిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా డెరైక్టర్లను అరెస్ట్ చేశారన్న వార్త తెలియడంతో కోర్టు, సబ్ జైలు వద్దకు ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఉద్యోగులు వచ్చి వారిని కలుస్తున్నారు.
 

మరిన్ని వార్తలు