క్వార్టర్స్‌ కేటాయించాలి

22 Oct, 2018 07:27 IST|Sakshi
జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడుతున్న ఎన్‌సీఎస్‌ సుగర్స్‌ ఉద్యోగులు

విజయనగరం : తమకు క్వార్టర్స్‌ కేటాయించేలా చర్యలు చేపట్టాలని ఎన్‌సీఎస్‌ చక్కెర పరిశ్రమలో ఇరవేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులు  ఎన్‌.శివాజీ, పీవీజీఎం.కృష్ణ, ఎస్‌.జగన్మోహనరావు, ఎం.కన్నారావు కోరారు. ఈ మేరకు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిజాం యాజమాన్యం పరిధిలో ఉన్న చక్కెర కర్మాగారాన్ని ఎన్‌సీఎస్‌ యాజమాన్యం కొనుగోలు చేసిందన్నారు. అయితే క్వార్టర్స్‌ను మాత్రం తమకు కేటాయించలేదని చెప్పారు. అదే నిజాం యాజమాన్యం పరిధిలో ఉన్న బోధన్‌ చక్కెర పరిశ్రమ ఆవరణలో ఉండే క్వార్టర్స్‌ను అక్కడి ఉద్యోగులకు కేటాయించారని జననేత దృష్టికి తీసుకువచ్చారు. అధికార టీడీపీ నేతలు సృష్టిస్తున్న అడ్డంకుల కారణంగానే ఇక్కడి ఎన్‌సీఎస్‌ పరిశ్రమ యాజమాన్యం తమకు క్వార్టర్స్‌ కేటాయించడం లేదని వాపోయారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే నిబంధనల ప్రకారం ప్రభుత్వ ధరకు క్వార్టర్స్‌ కేటాయించేలా చర్యలు చేపట్టాలని కోరారు.

ఆధారం లేదు..
నాకు ఏడాది కిందట దవడ క్యాన్సర్‌ వచ్చింది. అప్పులు చేసి వైద్యసేవలు పొందుతున్నాను. నా భార్య శారద కూడా ఏడాది కిందట చెట్టుపైనుంచి జారి పడి తీవ్రంగా గాయపడింది. రెండు కాళ్లు విరిగిపోవడంతో మంచానికే పరిమితమైంది. ఇద్దరం మంచం పట్టడంతో పిల్లలను పెంచలేకపోతున్నాం. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు.  ఎటువంటి ఆసరా లేని తమను ఆదుకోవాలని జగన్‌మోహన్‌రెడ్డిని కోరాను.– బాత రాము, గొర్లె సీతారామపురం, బొబ్బిలి మండలం

సమస్యలతో సహవాసం
మా గ్రామంలో అనేక సమస్యలు తిష్ట వేశాయి. అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా రహదారి సౌకర్యం లేక పోవడంతో ఏళ్ల తరబడి ఇబ్బంది పడుతున్నాం. అలాగే భూములకు సంబంధించి రైతుల వద్ద పట్టాదారు పాస్‌పుస్తకాలున్నా.. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం వేరే వారి పేర్లు ఉన్నాయి. ఎస్సీ కాలనీకి తాగునీటి సౌకర్యం లేదు. టీడీపీ పాలన అంతా అస్తవ్యస్తంగా ఉంది. వైఎస్‌స్రాŠసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలపై దృష్టి సారించాలి.      – కోటశిర్లాం గ్రామస్తులు 

>
మరిన్ని వార్తలు